అప్పుడు కంగనా సూపర్.. ఇపుడు మాత్రం..!

మణికర్ణిక ఇప్పుడు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నానుతున్న సినిమా. మణికర్ణిక డైరెక్షన్ గోలకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా [more]

Update: 2019-01-30 08:43 GMT

మణికర్ణిక ఇప్పుడు అటు బాలీవుడ్ లో, ఇటు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా నానుతున్న సినిమా. మణికర్ణిక డైరెక్షన్ గోలకి ఇప్పట్లో ఎండ్ కార్డు పడేలా కనబడటం లేదు. దర్శకుడు క్రిష్ మీడియా ముందు కంగనా గురించి ఆమె క్యారెక్టర్ గురించి మట్లాడుతుంటే.. కంగనా కామ్ అయినా ఆమె సిస్టర్ మాత్రం క్రిష్ కి సోషల్ మీడియా వేదికగా కౌంటర్లు ఇస్తుంది. క్రిష్ కి, కంగనాకు మధ్య ఇంత మాటల యుద్ధం జరుగుతుంటే… ఆ సినిమా రచయిత టాలీవుడ్ టాప్ రైటర్ విజయేంద్రప్రసాద్ మాత్రం కామ్ అయ్యాడు. గతంలో అంటే క్రిష్ బయటికొచ్చేసాక కంగనా దర్శకత్వ బాధ్యతలు చేపట్టి మణికర్ణిక పూర్తి చేసి ప్రమోషన్స్ కి వెళ్ళినప్పుడు రైటర్ విజయేంద్ర ప్రసాద్ ఒక ఈవెంట్ లో కంగనా దర్శకత్వాన్ని తెగ పొగిడేసాడు.

స్పందించిన రచయిత…

అప్పుడే కంగనా రనౌత్ ని రెచ్చగొడుతున్న విజయేంద్ర ప్రసాద్ అంటూ మీడియా కోడై కూసింది. మరి తాజాగా మాణికర్ణికపై జరుగుతున్న రచ్చకు లేట్ గా స్పందించిన విజయేంద్ర ప్రసాద్… చాలా తెలివిగా మట్లాడాడు. తాను మణికర్ణిక సినిమాకి కథ మాత్రమే అందించానని.. ఎప్పుడూ సెట్స్ కి వెళ్లలేదని… కంగనా, క్రిష్ లు ఏది కోరితే వారికది అందించాను తప్ప.. అంతకు మించి సినిమా దర్శకత్వంలో, నిర్మాణంలో నాకెలాంటి సంబంధం లేదని… తాను కథ ఇచ్చిన కొందరు డైరెక్టర్స్ స్క్రిప్ట్ తో పాటుగా తమకు నచ్చింది చిత్రీకరిస్తారని… మరికొందరు కాస్త కొత్తగా ఆలోచిస్తారని చెబుతున్నాడు.

తెలివిగా తప్పించుకున్నారు…

ఇక మణికర్ణిక సినిమా విషయంలో అటు క్రిష్ ఇటు కంగనా ఇద్దరూ తమ బాధ్యతలను చక్కగా నిర్వర్తించారని… కాదు న్యాయం చేసారని చెబుతున్నాడు పెద్దాయన. మరి మొదట్లో కంగనా డైరెక్టన్ గొప్ప అని మాట్లాడిన విజయేంద్ర ప్రసాద్ కి ఇప్పుడు క్రిష్ డైరెక్షన్ గుర్తొచ్చి.. అలా మాట్లాడాడో.. లేదంటే అసలే మణికర్ణిక సినిమా పోయింది.. ఇప్పుడు క్రిష్ ని హైలెట్ చేసినా… కంగానాని హైలెట్ చేసినా మొదటికే మోసం వస్తుందని అనుకున్నాడో కానీ.. మొత్తానికి తెలివిగా చెప్పి తప్పించుకున్నాడు.

Tags:    

Similar News