ఇక సర్దుకోవడమేనా?

ఒక సినిమాని నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టి తీస్తున్నారు అంటే… సరిపోదు. దానికి తగిన పబ్లిసిటీ ని కూడా నిర్మాతలు మీడియా ద్వారా చేస్తేనే అది ప్రేక్షకుల [more]

Update: 2019-07-15 04:59 GMT

ఒక సినిమాని నిర్మాతలు భారీగా ఖర్చు పెట్టి తీస్తున్నారు అంటే… సరిపోదు. దానికి తగిన పబ్లిసిటీ ని కూడా నిర్మాతలు మీడియా ద్వారా చేస్తేనే అది ప్రేక్షకుల వరకు చేరుతుంది. అందుకే దర్శక నిర్మాతల దగ్గరనుండి హీరో హీరోయిన్స్ వరకు మీడియా తో ఎంతో హుందాగా ప్రవర్తిస్తారు. ఇక అప్పుడప్పుడు రివ్యూ రైటర్స్ మీద హీరోలైనా, దర్శకులైనా విరుచుకుపడింది.. తర్వాత వాళ్ళని ఏ కాక్ టైల్ పార్టీతోనే కూల్ చేసేస్తుంటారు. కానీ.. మీడియా తో మాత్రం గొడవలు తెచ్చుకోరు. అలా ఉంటేనే తమ సినిమాకి కావాల్సిన పబ్లిసిటీని మీడియా చేస్తుంది. మరి మీడియా తో ఎంతో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన టైం లో ఓ బాలీవుడ్ హీరోయిన్ నోటి దూలతో నోరు పారేసుకుని… మీడియా తో వైరం తెచ్చుకుంది.

బాలీవుడ్ లో రెబల్ అంటే ముక్కుసూటి హీరోయిన్ గా పేరు తెచ్చుకునన్ కంగనా రనౌత్ కి మండితే ఎంతటి వారినైనా వదలదు. అందులో తనతో సహజీవనం చేసిన హృతిక్ ని ఇప్పటికి ఆడుకుంటూనే ఉంది. ఇక టాలీవుడ్ దర్శకుడు క్రిష్ తో కూడా గేమ్ ఆడిన కంగనా ఇపుడు మీడియా చేతికి చిక్కింది. చాలామంది బాలీవుడ్ దర్శకులు కంగానని బ్యాన్ చేసినా కొత్త దర్శకులతో సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న కంగనా తాజాగా జడ్జిమెంటల్ క్యాహై చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన గత సినిమా మణికర్ణికా రివ్యూ విషయమై ఓ పాత్రికేయుడితో కంగనా గొడవ పెట్టుకోవడంతో.. మీడియా కంగానని బ్యాన్ చేసింది. కంగనా సినిమా ప్రమోషన్స్ కి కానీ ఇంకేదన్నా ప్రెస్ మీట్స్ కి కానీ వారు వెళ్లకుండా కంగానా పై బ్యాన్ విధానచడమే కాదు..వారికీ మద్దతుగా.. ప్రెస్ క్లబ్ ఆఫ్ ఇండియా కంగనా ను బ్యాన్ చేస్తున్నట్లు ప్రకటించింది.

కంగనా దిగొచ్చి సారీ చెబితేనే గాని… బ్యాన్ ఎత్తమని డిమాండ్ చేస్తుంది. అయితే కంగనా లాయర్ మాత్రం మీడియా ప్రతినిధులు కంగనాపై బ్యాన్ విధించడం వలన తన క్లయింట్ చాలా నష్టపోయిందని… కంగనా పై బ్యాన్ ఎత్తివెయ్యకపోతే.. చాలా నష్టపరిహారం మీడియా ప్రతినిధులు చెల్లించాల్సి వస్తుందని నోటీసు లు పంపాడు. మరి ఇలా మీడియాకే నోటీసు లు పంపితే.. రేపటినుండి కంగనా విషయం మరింత పాకాన పడి.. మీడియా చేతిలో కంగనా బుక్ అవడం ఆమె కెరీర్ కి చాలా ప్రమాదమంటున్నారు. మరి జడ్జిమెంటల్ క్యాహై సినిమా నిర్మాతలు ఈ కంగనా వ్యవహారంతో సమస్యల్లో పడ్డారు.

Tags:    

Similar News