అలియాని వదలంటున్న నోటిదురుసు హీరోయిన్

గతంలో వారసత్వ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి వచ్చి టాప్ పొజిషన్ కి వెళ్లడం ఒక వింతేమీ కాదు…. నాలాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో టాప్ హీరోయిన్ [more]

Update: 2019-04-12 05:11 GMT

గతంలో వారసత్వ బ్యాగ్రౌండ్ తో సినిమాల్లోకి వచ్చి టాప్ పొజిషన్ కి వెళ్లడం ఒక వింతేమీ కాదు…. నాలాగా ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమాల్లో టాప్ హీరోయిన్ గా నిలబడడం గొప్పంటూ వారసత్వం విషయంలో అలియా భట్ ని బహిరంగంగానే ఒక ఆట ఆదుకున్న కంగనా రనౌత్ మరోసారి అలియా భట్ పై నోరు పారేసుకుంది. ఎప్పుడూ ముక్కుసూటిగా అందరి విషయంలో ఓపెన్ గా మాట్లాడుతూ తిట్లు తినే కంగనా మరోమారు అలియా భట్ ని టార్గెట్ చేసింది. నిన్నగాక మొన్న మణికర్ణికా విషయంలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారిన కంగనా ఇప్పుడు మరోమారు బాలీవుడ్ మీడియాకి మేత వేసింది.

గత ఏడాది అలియా భట్ నటించిన గల్లీ బాయ్ సినిమాతో అలియా భట్ తొ ప్రతి అవార్డు విషయంలో మణికర్ణికా లో కంగనా చేసిన పాత్ర పడుతూ వస్తుంది. అయితే తాజాగా జరిగిన ఓ అవార్డు వేడుకలో మణికర్ణికా కు గట్టి పోటీ ఇచ్చింది గల్లీ భాయ్ అలియా భట్. ఫైనల్ గా ఆ అవార్డు ని మణికర్ణికా తో బెస్ట్ పెరఫార్మెన్స్ ఇచ్చినందుకు గాని కంగనాకు రావడంతో.. మీడియా వారు కంగనాని.. ఈ అవార్డు విషయంలో అలియా భట్ నుంచి గట్టిపోటీ ఎదురైందా.. అని అడగగా… దానికి కంగనా రనౌత్ గల్లీ బాయ్ సినిమాలో అలియా పాత్ర ఏమంత గొప్పగా లేదు. అసలు నిజంగా చెప్పాలంటే గల్లీ బాయ్ లో అలియా చాలా రొటీన్ పాత్ర చేసింది. అలియా గల్లీ బాయ్ లో చేసిన పాత్ర నాకేం నచ్చేలేదు.

అలంటి పాత్ర చేసిన అలియా తొ నాకు పోటీనా అంటూ… అలియా భట్ ని ఉద్దేశించి.. ఇలాంటి చెత్త పాత్రలకు ప్రాధాన్యం ఇవ్వడం తగ్గిస్తే బావుంటుందని.. ఉచిత సలహా కూడా పారేసింది కంగనా. మరి అంతలా అలియా పై ఘాటైన వ్యాఖ్యలు చేసిన కంగనాపై అలియా స్పందన ఎలా ఉంటుందో చూడాలి.

Tags:    

Similar News