కంగనా కన్నా క్రిష్ కే ఎక్కువ టెన్షన్..!

మరో రెండు రోజుల్లో కంగనా నటించి డైరెక్ట్ చేసిన ‘మణికర్ణిక’ రిలీజ్ అవ్వబోతుంది. మొదట ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేసి కొన్ని కారణాల వల్ల బయటకి [more]

Update: 2019-01-23 10:45 GMT

మరో రెండు రోజుల్లో కంగనా నటించి డైరెక్ట్ చేసిన ‘మణికర్ణిక’ రిలీజ్ అవ్వబోతుంది. మొదట ఈ సినిమాను క్రిష్ డైరెక్ట్ చేసి కొన్ని కారణాల వల్ల బయటకి వస్తే మిగిలిన సినిమా కంగనా డైరెక్ట్ చేసింది. అయితే క్రిష్ డైరెక్ట్ చేసిన కొన్ని మేజర్ సీన్స్ ని కూడా కంగనా మళ్లీ డైరెక్ట్ చేసింది. క్రిష్ ను లేటెస్ట్ ఇంటర్వ్యూ లో మీరు ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకోడానికి కారణం ఏంటి అని అడిగితే కథను వక్రీకరించారని అందుకే సోను సూద్ తో పాటు తాను కూడా తప్పుకున్నానని చెప్పాడు. ఈ చిత్రానికి కథ అందించిన విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. కంగనా సీనియర్ డైరెక్టర్స్ కి ఏ మాత్రం తీసిపోలేదని సినిమా అవుట్ ఫుట్ బాగా వచ్చిందని ఓ రేంజ్ లో పొగిడేశారు. మరి వీరిద్దరి మాటల్లో ఏది నిజమో తెలియాంటే రెండు రోజులు వరకు ఆగాల్సిందే. అయితే ఈ సినిమాకి ఎలాంటి సందడి కాదు కదా కనీసం మినిమం బజ్ కూడా కనిపించడం లేదు. అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో నత్తనడకన సాగుతుంది. అయితే తెలుగు వెర్షన్ మాత్రం ఇంకా పెట్టలేదు.

సినిమాకు క్రేజ్ రాకపోవడంతో…

సరే నార్త్ లో అయినా ఈ సినిమాకు క్రేజ్ ఉంటుందా అంటే అది కూడా కనిపించడం లేదు. ఆ రోజు విడుదల అయ్యే నవాజుద్దీన్ సిద్ధికి నటించిన థాక్రేకే ఎక్కువ క్రేజ్ కనిపిస్తోంది. ఒకవేళ తెలుగులో రిలీజ్ అయినా ఆ రోజు అఖిల్ నటించిన మిస్టర్ మజ్నుకే క్రేజ్ ఎక్కువ ఉంది. ఆ సినిమా హిట్ అయితే మణికర్ణిక వైపు చూడటమే కష్టం అయిపోతుంది. ఇక ఎఫ్ 2 స్ట్రాంగ్ గానే ఉంది. ఒకవేళ ఈ సినిమా ఆడకపోయినా క్రిష్ కు బాడ్ నేమ్ వస్తుంది. దీంతో చిత్రం ఆడడం క్రిష్ కు చాలా అవసరం. సినిమా వస్తుందని తెలియాలంటే కనీసం ప్రమోషన్స్ కూడా చేయట్లేదు. మరి ఈ పరీక్షని వీరనారి తట్టుకుంటుందా చూద్దాం. 25న ఈ మూవీ రిలీజ్ అవ్వబోతుంది.

Tags:    

Similar News