కంచరపాలెం సినిమా హిట్టే.. కానీ...!

Update: 2018-09-08 09:00 GMT

గత పది రోజుల నుండి సోషల్, వెబ్ మీడియాలో C /O కంచరపాలెం సినిమా గురించి ముచ్చట్లు జోరుగా ప్రచారం జరుగుతున్నాయి. రానా సమర్పకుడిగా.. చిన్న సినిమాని భారీ ప్రమోషన్స్ తో ప్రేక్షకుల ముందుకు తెచ్చిన రానా.. ఆ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. దర్శకుడు వెంకటేష్ మహా డైరెక్షన్ లో తెరకెక్కిన C/O కంచరపాలెం సినిమా నిన్న విడుదలై ప్రేక్షకులకు, క్రిటిక్స్ కి ఓవరాల్ గా నచ్చేయ్యడమే కాదు.. సినిమాకి ఫుల్ గా పాజిటివ్ మార్కులు పడిపోయాయి. చాలా తక్కువ అంటే లక్షల బడ్జెట్ లోనే తెరకెక్కిన కంచరపాలెం సినిమా ఇప్పుడు ట్రేడ్ తో పాటు ప్రేక్షకులను బాగా ఆకర్షించింది. ఇక సినిమా ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు కంచరపాలెం సినిమాకి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ ఇవ్వడం కూడా సినిమా ప్రమోషన్స్ కి బాగా పనికొచ్చింది.

అక్కినేని వారి సినిమాలు వస్తుండటంతో...

కంచరపాలెం అనే ఊరి కథతో ఎంతో సహజసిద్ధంగా కంచరపాలెం ఊరి వాళ్లతోనే సినిమాలో నటింపజేసిన వెంకటేష్ మహా... ఈ సినిమాతో మంచి పేరు హిట్టు కొట్టేసాడు. కంచరపాలెం అనే గ్రామాన్ని కళ్ల ముందు ఆవిష్కరించిన తీరుకు దక్కుతున్న అభినందనలకు దర్శక నిర్మాతలు గాల్లో ఎగిరిపోతున్నారు. అయితే అంత పాజిటివ్ టాక్ వచ్చిన కంచరపాలెం సినిమా కలెక్షన్స్ ఎంత తీసుకొస్తుందో అనేది మాత్రం అంతుబట్టడం లేదు. ఎందుకంటే చాలా తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమాకి బీ, సీ సెంటర్స్ లో వీక్ ఓపెనింగ్స్ వచ్చాయి. మౌత్ టాక్ స్ప్రెడ్ అవ్వడానికి సాధారణంగా ఏ సినిమాకైనా రెండు మూడు రోజులు పడుతుంది. కానీ వినాయక చవితి కానుకగా ఈ నెల 13 గురువారమే నాగ చైతన్య.. శైలజారెడ్డి అల్లుడు, సమంత.. యూ-టర్న్ మంచి హైప్ తో బాక్స్ ఆఫీస్ వద్దకు రావడానికి పోటీపడుతున్నాయి.

అవార్డులు మాత్రం ఖాయం..!

మరి తక్కువ బడ్జెట్ కనుక కంచరపాలెం సినిమాకి పెట్టిన పెట్టుబడి అయితే సులువుగానే వచ్చేస్తుంది. కానీ ఎన్ని లాభాలు తెచ్చిపెడుతుంది అనేది మాత్రం చెప్పడం కష్టం. నిన్న శుక్రవారం విడుదలైన ఐదారు సినిమాల్లో ఈ సినిమాకే మంచి టాక్ రావడం మిగతావన్నీ వీక్ టాక్ స్ప్రెడ్ అవడం కలిసొచ్చింది. ఇక ఈ సినిమాకి అవార్డులు, రివార్డులు ఒక రేంజ్లో రావడం ఖాయం. మరి క్లాస్ లో కలెక్షన్స్ బాగుండి బీ, సీ సెంటర్స్ లో వీక్ అయితే కలెక్షన్స్ కూడా అదే రేంజ్ లో ఉంటాయి. ఇక వెంకటేష్ మహా టేకింగ్ కి అందరూ ఫిదా అవుతుంటే చంద్రుడిలో మచ్చలాగా ఈ సినిమాకి మైనస్ మాత్రం సినిమా డాక్యుమెంటరీలా ఉండడం, కమర్షియల్ ఎలిమెంట్స్ లేకపోవడమనే మైనస్ లు తప్ప సినిమా మొత్తం సూపర్ గా ఉందంటున్నారు.

Similar News