హిందీ 'కాంచన' రీమేక్ లో ఎవరో తెలుసా..?

Update: 2018-10-17 06:48 GMT

డాన్సర్ గా... డైరెక్టర్ గా మంచి పేరు తెచ్చుకున్న లారెన్స్ దర్శకత్వంలో 'కాంచన' సినిమా తమిళంలో, తెలుగులో మంచి టాక్ దక్కించుకుంది. లారెన్స్ నటన అయితే అద్భుతం అని ఈ సినిమా చూసిన ప్రేక్షకులు చెప్పిన మాట. అయితే ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఇందులో హీరోగా బాలీవుడ్ విలక్షణ నటుడు అక్షయ్ కుమార్ నటించనున్నాడు. అక్షయ్ కుమార్ విభిన్నమైన కథలను ఎంచుకుని.. విలక్షణమైన పాత్రలను చేయడానికి ఇంట్రెస్ట్ చూపుతుంటారు.

హిందీలోనూ లారెన్స్

అందుకే అక్షయ్ ను ఈ ప్రాజెక్టు లో తీసుకున్నట్టు తెలుస్తుంది. హారర్ జోనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఎవరు డైరెక్ట్ చేస్తారో తెలియాల్సి ఉంది. బాలీవుడ్ కథనాల ప్రకారం అక్కడ కూడా లారెన్స్ ఈ సినిమా డైరెక్ట్ చేయనున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం కథానాయిక ఎంపిక ప్రక్రియ జరుగుతోందట. తమిళ, తెలుగు భాషల్లో కాసుల వర్షం కురిపించిన ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Similar News