కాంచన-3 సరికొత్త రికార్డు..!

డివైడ్ టాక్ తో ఊహించని విధంగా దూసుకుపోతుంది కాంచన-3. ఈ చిత్రం తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ మూవీ ముఖ్యంగా [more]

Update: 2019-05-01 11:01 GMT

డివైడ్ టాక్ తో ఊహించని విధంగా దూసుకుపోతుంది కాంచన-3. ఈ చిత్రం తమిళంలోనే కాదు తెలుగు రాష్ట్రాల్లో కూడా మంచి వసూళ్లు సాధిస్తుంది. ఈ మూవీ ముఖ్యంగా బీ, సీ సెంటర్లలో క్లిక్ అవ్వడం బాగా కలిసొచ్చింది. విడుదలైన వారం రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఈ చిత్రం 75 కోట్లు కలెక్ట్ చేసింది. ఇప్పుడు మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది ఈ చిత్రం. తెలుగులో ఈ ఏడాది రిలీజ్ అయి అత్యథిక వసూళ్లు సాధించిన సినిమాల సరసన చేరింది కాంచన-3. నిన్నటితో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా 100 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్ట్ చేయడం విశేషం.

టాప్ లోకి దూసుకెళుతోంది…

ఈ ఏడాది సౌత్ లో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాల్లో ఐదో స్థానంలో ఈ మూవీ నిలిచింది. ‘పేట’, ‘విశ్వాసం’, ‘ఎఫ్-2, ‘లూసిఫర్’ సినిమాల తర్వాత ‘కాంచన-3 ‘ ఉంది. ఇక ఇదే జోరు కొనసాగితే మరో 5 రోజుల్లో కాంచన-3 సినిమా ఎఫ్-2, ‘లూసిఫర్’ వసూళ్లను క్రాస్ చేయడం గ్యారెంటీ అంటోంది ట్రేడ్. హాలీవుడ్ మూవీ ‘ఎవంజర్స్ ధి ఎండ్ గేమ్’ ఉన్నప్పటికీ ఈ చిత్రం స్టాండర్డ్ గా రన్ అవుతుంది. ఇక కాంచన-3 ఊహించని విజయం సాధించడంతో కాంచన-4 కూడా ఎనౌన్స్ చేశాడు లారెన్స్.

Tags:    

Similar News