కంగనా డేటింగ్ లో ఉందట..!

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ లేటెస్ట్ గా మణికర్ణిక సినిమా చేస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆమె రీసెంట్ [more]

Update: 2019-03-04 10:53 GMT

బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న కంగనా రనౌత్ లేటెస్ట్ గా మణికర్ణిక సినిమా చేస్తే మంచి రెస్పాన్స్ అందుకుంది. అయితే ఆమె రీసెంట్ గా తన వ్యక్తిగత విషయాల్ని బయటపెట్టింది. ప్రస్తుతం తాను ఒక వ్యక్తితో డేటింగ్ చేస్తున్నానని చెప్పింది. అయితే ఆ వ్యక్తి ఎవరో, అతను ఏం చేస్తాడో, అతను సినిమా రంగానికే చెందినవాడా లేక బయటివాడా అనేది మాత్రం చెప్పలేదు. గతంలో కంగనా హృతిక్ రోషన్ తో డేటింగ్ చేసినట్టు చెప్పుకుంది. దీన్ని హృతిక్ రోషన్ ఖండించాడు. అలా వారిద్దరి మధ్య వివాదం స్టార్ట్ అయింది. అది అంతటితో ఆగలేదు.

ఈసారి పెళ్లి చేసుకుంటా…

ఆమె హృతిక్ కు సంబంధించిన కొన్ని ఈమెయిల్స్ ను బయట పెట్టింది. ఆ తరువాత కంగనా కొన్ని ఫొటోల్ని కూడా లీక్ చేసింది. అయితే వీటిపై తనకు ఎలాంటి సంబంధం లేదని హృతిక్ చెప్పుకొచ్చాడు. అలా ఆ గొడవ పెద్దదై ఇద్దరు విడిపోయారు. అయితే ఇన్ని అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న తనకు డేటింగ్ కంటే ఓ తోడు కోరుకుంటున్నట్టు తెలిపింది. మరి ప్రస్తుతం డేటింగ్ చేస్తున్న వ్యక్తిని పెళ్లి చేసుకుంటుందేమో అనుకుంటున్నారు బాలీవుడ్ మీడియా వారు. త్వరలోనే కంగనా మనసులో ఉన్న ఆ వ్యక్తి ఎవరో తెలియనుంది.

Tags:    

Similar News