మరో సీక్వెల్ తో రానున్న కమల్!

Update: 2018-10-14 12:11 GMT

ఇండియాలో గర్వించే నటుల్లో కమల్ హాసన్ ఒక్కరు. తన మొదటి సినిమా నుండి విలక్షణంగా నటించడం కమల్ కి అలవాటు. ఇతను మంచి నటుడే కాదు మంది డైరెక్టర్ కూడా. అతని నటన గురించి చెప్పాలంటే మనకు ముందుగా గుర్తు వచ్చేది తను నటించిన 'దశావతారం' సినిమా. ఇందులో కమల్ 10 పాత్రల్లో నటించారు. ఏ పాత్ర కి ఆ పాత్రే హైలైట్.

విశ్వరూపం డిజాస్టర్ కావడంతో.....

కమల్ సీక్వెల్స్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపుతూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే ఇటీవల 'విశ్వరూపం 2' సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకుని వచ్చాడు. అది డిజాస్టర్ అయింది అది వేరే విషయం. ఇక ప్రస్తుతం ఆయన శంకర్ దర్శకత్వంలో 'భారతీయుడు' సినిమా సీక్వెల్లో చేయడానికి రెడీ అవుతున్నారు. త్వరలోనే ఇది సెట్స్ మీదకు వెళ్లనుంది.

క్షత్రియపుత్రుడు కూడా....

ఇది ఇలా ఉండగా 'క్షత్రియపుత్రుడు' సీక్వెల్ చేయడానికి కూడా సిద్ధమవుతున్నారని సమాచారం. 'భారతీయుడు 2' తరువాత ఈ సినిమా పట్టాలెక్కుతుందని కమల్ చెప్పారు. సో మొత్తానికి కమల్ మూడో సీక్వెల్ కి కూడా రెడీ అవుతున్నారన్న మాట. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి పూర్తి వివరాలు తెలియనున్నాయి.

Similar News