ఎలక్షన్స్ కోసం కాదు.. మేకప్ కోసమే ఆగింది..!

కోలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రెండు [more]

Update: 2019-03-21 07:08 GMT

కోలీవుడ్ లో లైకా ప్రొడక్షన్స్ నిర్మాణంలో శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా భారతీయుడు 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే మొదటి రెండు షెడ్యూల్స్ పూర్తయ్యాక సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. శంకర్ భారీ ఖర్చు వల్లనే లైకా ప్రొడక్షన్స్ సినిమాని నిలిపేసిందని… శంకర్ వల్ల 2.ఓకి చాలా నష్టపోయినా శంకర్ మాత్రం దుబారా ఖర్చు పెట్టించడం వలన లైకా వారికి, శంకర్ కి మధ్య విభేదాలు తలెత్తాయని.. అందుకే భారతీయుడు 2 షూటింగ్ ని ఆపేశారని టాక్ నడిచింది. అయితే శంకర్ బడ్జెట్ అదుపులోనే సినిమాని తీస్తున్నాడని.. కానీ కమల్ హాసన్ తమిళనాట ఎన్నికల్లో పోటీ చెయ్యబోతున్నాడు కాబట్టే షూటింగ్ ని పక్కనబెట్టారని అన్నారు. శంకర్ వలన కాదు కమల్ వలనే భారతీయుడు షూటింగ్ ఆగిపోయిందని ప్రచారం జరిగింది.

అలెర్జీ వల్లేనా..?

కానీ తాజా సమాచారం ప్రకారం.. కమల్ హాసన్ వృద్ధుడి పాత్రకి వేసే మేకప్ వలన కమల్ కి అలెర్జీ వస్తోందట. మరి భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ వృద్ధుడి పాత్రలో మేకప్ పరంగా అదరగొట్టేసాడు. దానికి సీక్వెల్ గా తెరకెక్కుతున్న భారతీయుడు 2 లో కూడా ఈ వృద్ధుడి క్యారెక్టర్ చాలా కీలకం అంటున్నారు. అయితే మొదట్లో మేకప్‌ కారణంగా కమల్‌కు అలెర్జీ రావడంతో కొన్ని రోజులు చిత్రీకరణ ఆపారట. కొంతకాలం గ్యాప్‌ ఇచ్చి మళ్లీ మేకప్‌ వేసి చూడగా అదే పరిస్థితి ఎదురైందట. దాంతో కమల్ హాసన్ కి కొద్దీ రోజుల పాటు విరామం ఇచ్చినట్లు తెలుస్తోంది. భారతీయుడు 2లో ఈ వృద్ధుడి క్యారెక్టర్ సినిమా మొత్తం ఉంటుందట. మరి ఎక్కువగా కమల్ ఆ వృద్ధుడి గెటప్ లోనే ఉండాలంటే ఆ మేకప్ తప్పనిసరి.

Tags:    

Similar News