కమల్ రిజెక్ట్ చేసాడు.. అక్షయ్ అందుకున్నాడు!

Update: 2018-11-02 06:47 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ - శంకర్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన 2.ఓ మూవీ ఈ నెలాఖరునే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. భారీ క్రేజ్ తో భారీ గ్రాఫిక్స్ తో ఉన్న ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రేపు మూడో తారీఖున 2.ఓ ట్రైలర్ కోసమే ఎగబడుతున్న ప్రేక్షకులు సినిమా కోసం మరెంత ఇంట్రెస్ట్ చూపుతారో తెలిసిందే. అయితే ఈ సినిమా విడుదల సమయం దగ్గర పడుతున్నా కొద్ది ఈ సినిమాపై మంచి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటికొస్తున్నాయి. రజనీకాంత్ రోబోగా, బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్ విలన్ గా, అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తున్నాడు.

హాలీవుడ్ నటుడు... కమల్ హాసన్...

అయితే 2.ఓ సినిమాలో రోబోగా రజనీకాంత్ పాత్ర ఎంత హైలెట్ గా నిలుస్తుందో... విలన్ అక్షయ్ పక్షి పాత్ర కూడా అంతే హైలెట్ గా నిలుస్తుందట. మరి విలన్ గా మొదట అక్షయ్ కుమార్ ని అనుకోలేదట. 2.ఓ విలన్ గా మొదట హాలీవుడ్ ప్రముఖ నటుడు ఆర్నాల్డ్ ష్వార్జ్‌నెగ్గర్‌ను అనుకున్నామని... కానీ ఆయనకు ఉన్న కారణాలతో ఆయన ఈ సినిమా చెయ్యనని చెప్పారని తెలిపిన శంకర్...తర్వాత ఈ పాత్రకి గాను కమల్‌ను సంప్రదించామని చెప్పాడు. అయితే ఎప్పటి నుండో కమల్ అభిమానులు, రజనీకాంత్ అభిమానులు రజనీ, కమల్ కలిసి నటిస్తే చూడాలనుకున్న కల నెరవేరుతుందని అనుకున్నామని అందుకే కమల్ ని ఆ పాత్ర కోసం సంప్రదించామని చెప్పాడు. అయితే శంకర్ తో కలిసి కమల్ దగ్గరికి చిత్ర మాటల రచయిత జయమోహన్ వెళ్లగా కమల్ హాసన్ మాత్రం తనకి శంకర్ తో భారతీయుడు 2 లో మాత్రమే నటించాలనే ఆసక్తి ఉందని చెప్పాడు. చివరికి ఆ విలన్ పాత్రకి అక్షయ్ ని సెలెక్ట్ చేసుకున్నామని చెప్పాడు శంకర్.

Similar News