వైవిధ్యంగా కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్.. టైటిల్..!

Update: 2018-12-03 08:50 GMT

ఒక ప‌క్క క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు.. మ‌రో ప‌క్క వైవిధ్య‌మున్న సినిమాల‌కు ప్రాధాన్య‌త ఇస్తూ హీరోగా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటున్నారు నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌. కళ్యాణ్ రామ్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న స్టైలిష్ యాక్‌నన్ స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ '118'. ప్ర‌ముఖ సినిమాటోగ్రాఫ‌ర్ కె.వి.గుహ‌న్ ఈ చిత్రం ద్వారా ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఈస్ట్‌ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ బ్యాన‌ర్‌పై మ‌హేశ్ కొనేరు నిర్మిస్తున్న ఈ సినిమా ఫ‌స్ట్‌లుక్‌, టైటిల్‌ను విడుద‌ల చేశారు. చిత్రీక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి.

తారాగణం, సాంకేతిక నిపుణులు

నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, నివేదా థామ‌స్‌, షాలిని పాండే త‌దిత‌రులు న‌టించిన ఈ చిత్రానికి మాట‌లు: మిర్చి కిర‌ణ్‌, పీఆర్, మార్కెటింగ్‌: వం్శీ కాక‌, ఆర్ట్‌: కిర‌ణ్ కుమార్‌.ఎం, ఎడిట‌ర్‌: త‌మ్మిరాజు, సంగీతం: శేఖ‌ర్ చంద్ర‌, ఫైట్స్‌: వెంక‌ట్‌, అన్బ‌రివు, రియ‌ల్ స‌తీశ్‌, వి.ఎఫ్.ఎక్స్‌: అద్వైత క్రియేటివ్ వ‌ర్క్స్‌, అనిల్ ప‌డూరి, నిర్మాత‌: మ‌హేశ్ కొనేరు, క‌థ‌, స్క్రీన్‌ప్లే, సినిమాటోగ్ర‌ఫీ, ద‌ర్శ‌క‌త్వం: కె.వి.గుహ‌న్‌.

Similar News