ఇక్కడ సూపర్… అక్కడ మాత్రం..?

చాన్నాళ్లకు కళ్యాణ్ రామ్ కి 118తో హిట్ పడింది. అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కు సన్నిహితుడైన మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించగా… కె.వి.గుహన్ సినిమాటోగ్రాఫర్ [more]

Update: 2019-03-05 06:50 GMT

చాన్నాళ్లకు కళ్యాణ్ రామ్ కి 118తో హిట్ పడింది. అన్నదమ్ములు కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ కు సన్నిహితుడైన మహేష్ కోనేరు ఈ చిత్రాన్ని నిర్మించగా… కె.వి.గుహన్ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా ప్రమోట్ అయ్యి ఈ సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమా థ్రిల్లర్ సబెక్టుతో తెరకెక్కి థ్రిల్లింగ్ హిట్ గా నిలిచింది. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. గత రెండు నెలలుగా ఉసూరుమంటున్న బాక్సాఫీసు ఈ 118 మూవీ హిట్ తో కళకళలాడుతుంది. ఇక కెరీర్ లో కళ్యాణ్ రామ్ మూడో హిట్ అందుకున్నాడు.

కలిసొచ్చిన శివరాత్రి

ఇక తెలుగు రాష్ట్రాల్లో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతున్న 118 మూవీ ఫస్ట్ వీకెండ్ లో సుమారు 4 కోట్ల షేర్ ని వసూలు చేసి ఫర్వాలేదనిపించింది. ఇక నిన్న శివరాత్రి సెలవు కూడా కళ్యాణ్ రామ్ కి కలిసొచ్చింది. ఈ ఆదివారం, సోమవారం థియేటర్స్ నిండుగా కనబడ్డాయి. 118 సినిమా ఆడుతున్న థియేటర్స్ లో కాస్త కళ కనబడింది. ఈ లెక్కన చూసుకుంటే తెలుగు రాష్ట్రాల్లోనే 118 మూవీ నాలుగు రోజుల్లోనే బ్రేక్‌ ఈవెన్‌ మార్కు చేరిపోతుంది. అన్ సీజన్ లో వచ్చినా 118 కి లాభాలు రావడం ఖాయం మంటున్నాయి ట్రేడ్ వర్గాలు. ఎలాగూ వచ్చే వారం చిన్న చిన్న సినిమాలే విడుదలవుతున్నాయి కాబట్టి… వచ్చే వారం కూడా 118దే హావా అంటున్నారు.

ఓవర్సీస్ లో డల్ గా

మరి ఇక్కడ బాగానే ఉన్నా 118 కలెక్షన్స్ ఓవర్సీసీ లో డల్ గా ఉన్నాయి. ఫస్ట్ డే హిట్ టాక్ తో నెక్స్ట్ డే ఈ సినిమాకి కొన్ని లొకేషన్స్ ని యాడ్ చేసినా అక్కడ 118 కలెక్షన్స్ తక్కువగా ఉన్నాయంటున్నారు. కళ్యాణ్ రామ్ కి ఓవర్సీసీ మార్కెట్ అంతగా లేకపోవడమే ఈ డల్ వసూళ్లకు కారణమంటున్నారు. అందులోనూ ఓవర్సీస్ లో టాలీవుడ్ సినిమాల హావా గత రెండు నెలలుగా చాలా తగ్గింది. విడుదలైన ప్రతి సినిమా బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టడంతో.. అక్కడ ఓవర్సీసీ మర్కెట్ కూడా డల్ అయ్యింది. అందుకే కళ్యాణ్ రామ్ సినిమా కలెక్షన్స్ మీద ఆ ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంది. ఓవర్సీస్ లో 118 మూవీకి భారీ ప్రమోషన్స్ చేసినప్పటికీ ఈ రకమైన సాదాసీదా కలెక్షన్స్ చూసి ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్స్ కంగారు పడుతున్నారు.

Tags:    

Similar News