కల్యాణికి ఆ ఛాన్స్ రాలేదట..!

హలో చిత్రం ఫ్లాప్, చిత్రలహరి యావరేజ్. దీంతో ఆ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శినికి ఏ మాత్రం గుర్తింపు రావడం లేదు. ట్రెడిషనల్ గర్ల్ [more]

Update: 2019-04-18 06:14 GMT

హలో చిత్రం ఫ్లాప్, చిత్రలహరి యావరేజ్. దీంతో ఆ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన కళ్యాణి ప్రియదర్శినికి ఏ మాత్రం గుర్తింపు రావడం లేదు. ట్రెడిషనల్ గర్ల్ గా, హీరోయిన్ గా చక్రం తిప్పుతుంది అనుకుంటే.. ఆమెకి ఏమాత్రం గుర్తింపులేని క్యారెక్టర్స్ దొరుకుతున్నాయి. హలో సినిమాలో అఖిల్ పక్కన టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామకి ఆ సినిమా ఫ్లాప్ అవడంతో మరో ఛాన్స్ రాదనుకున్నారు. ఎలాగో చిత్రలహరిలోను, శర్వానంద్ పక్కన నటించే ఛాన్స్ వచ్చింది. చిత్రలహరిలోనూ కళ్యాణి పెరఫార్మెన్స్ పరంగా, పాత్రపరంగా ఆకట్టుకోలేకపోయింది. అసలు దర్శకుడే కల్యాణికి మంచి ట్రాక్ సెట్ చెయ్యలేదు.

ఆమె లేదని చెప్పిన డైరెక్టర్…

ఇక తాజాగా కళ్యాణి చేతిలో మరో తెలుగు సినిమా పడినట్లుగా వార్తలొచ్చాయి. అది కూడా నితిన్ సరసన. వెంకీ కుడుముల – నితిన్ కాంబోలో తెరకెక్కబోతున్న భీష్మ సినిమాలో రష్మిక మందన్న ఫస్ట్ హీరోయిన్ కాగా.. సెకండ్ హీరోయిన్ గా కళ్యాణి ప్రియదర్శనికి ఛాన్స్ వచ్చినట్లుగా చెప్పారు. తాజాగా భీష్మ సినిమాలో ఒకే హీరోయిన్ అని.. అది కూడా రష్మిక మందన్ననే అని ఆ సినిమా దర్శకుడు వెంకీ కుడుముల చెప్పేశాడు. ఇక భీష్మ సినిమా స్క్రిప్ట్ లాక్ చెయ్యకవడంతో ఇంకా పట్టాలెక్కని సంగతి తెలిసిందే. ఇక వెంకీ చెప్పాడు కాబట్టి కళ్యాణి ప్రియదర్శినికి భీష్మ లో హీరోయిన్ ఛాన్స్ రాలేదన్నమాటేగా…!

Tags:    

Similar News