కళ్యాణ్ దేవ్ ‘విజేత’ అవుతాడు

Update: 2018-06-25 08:43 GMT

మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ హీరోగా పరిచయమవుతూ తెరకెక్కిన విజేత సినిమా ఆడియో రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి తో పాటు దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళి, కీరవాణి, అల్లు అరవింద్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్, నిర్మాత ఎన్. వి.ప్రసాద్ మరియు మైత్రి మూవీస్ చెర్రి హాజరయ్యారు. ఈ సందర్బంగా మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ... "35 ఏళ్ల క్రిందట నేను చేసిన విజేత సినిమా టైటిల్ తో ఇప్పుడు సినిమా రావడం సంతోషంగా ఉంది. డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి కథ చెప్పినప్పుడు నచ్చింది. తండ్రి, కొడుకుల మధ్య రిలేషన్ ఈ సినిమాలో చక్కగా చూపించారు. కొత్త తరగతి ఆడియన్స్ కు ఈ సినిమా తప్పకుండా నచ్చుతుంది. కళ్యాణ్ దేవ్ కొత్త లుక్ లో కనిపించబోతున్నాడు. రొమాంటిక్ సీన్స్, ఎమోషన్స్ సీన్స్ లో తన నటన చక్కగా కనబర్చారు." అన్నారు.

అందరినీ మెప్పించేలా ఉంటుంది...

డైరెక్టర్ రాకేష్ శశి మాట్లాడుతూ... "కళ్యాణ్ దేవ్ కథను నమ్మి ఈ సినిమా చేశారు. సాయి నన్ను నమ్మి ఈ సినిమా చేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. సినిమా అందరిని అలరిస్తోందని నమ్ముతున్నాను" అన్నారు. నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ..."విజేత సినిమా టైటిల్ తో కళ్యాణ్ దేవ్ సినిమా చెయ్యడం సంతోషంగా ఉంది. తెలుగు ఇండస్ట్రీకి ఇలాంటి నిర్మాతలు కావాలి. కళ్యాణ్ దేవ్ టాలెంటెడ్ నటుడు. ప్రోమోస్, సాంగ్స్ చూస్తుంటే తెలుస్తుంది. అతను సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా" అన్నారు. దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి మాట్లాడుతూ...

"ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు పెరిగాయి. విజేత విడుదల తరువాత నిర్మాత సాయి కొర్రపాటికి మంచి లాభాలు రావాలని కోరుకుంటున్నా. ప్రేమ్ రక్షిత్ కోడి సాంగ్ ను బాగా కొరియోగ్రఫీ చేసారు." అన్నారు.

నటీనటులు:

కళ్యాణ్ దేవ్, మాళవిక నాయర్, తనికెళ్ళ భరణి, మురళి శర్మ, నాజర్, సత్యం రాజేష్, ప్రగతి, కళ్యాణి నటరాజన్, పృథ్వి, రాజీవ్ కనకాల, జయ ప్రకాష్ (తమిళ్), ఆదర్శ్ బాలకృష్ణ, నోయల్, కిరీటి, భద్రం, సుదర్శన్, మహేష్ విట్టా.

Similar News