‘కల్కి’ అవతారంలో రాజశేఖర్..!

Update: 2018-08-27 06:13 GMT

రాజశేఖర్ హీరోగా తెరెకెక్కిన 'గరుడ వేగ' చిత్రం తర్వాత ఆయన నుండి ఒక్క సినిమా కూడా బయటికి రాలేదు. అది రిలీజ్ అయ్యి చాలా కాలం అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై క్లారిటీ లేదు. 'awe' చిత్రం ఫేమ్ ప్రశాంత్ వర్మ డా.రాజశేఖర్ తో ఓ సినిమా చేస్తాడని వార్తలు వచ్చినా వాటిపై ఇప్పటివరకు క్లారిటీ లేదు. ఈరోజు రిలీజ్ చేసిన మోషన్ పోస్టర్ తో సినిమా టైటిల్ ను రివీల్ చేశారు మేకర్స్. ఈ చిత్రానికి ‘కల్కి’ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఈ చిత్రం 1983 జరిగే మర్డర్ మిస్టరీ నేపథ్యంలో తెరకెక్కనుందట. ప్రశాంత్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమాలో రాజశేఖర్ కి జోడిగా తెలుగు అమ్మాయి అంజలి నటించనుంది.

ఆకట్టుకుంటున్న టీజర్

మోషన్ పోస్టర్ టీజర్ లో రకరకాల గుర్తులతో టైటిల్ వస్తుంది. దాని వెనక వచ్చే బ్యాక్ గ్రౌండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ప్రస్తుతం ప్రశాంత్ వర్మ 'క్వీన్' తెలుగు రీమేక్ పనిలో ఉన్నాడు. దాని తర్వాత ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. మరి ఈ మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో తెలియాల్సి ఉంది.

Similar News