కాపీ చిక్కుల్లో కల్కి!

గరుడ వేగా చిత్రం తో డీసెంట్ హిట్ అందుకున్న యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ప్రస్తుతం కల్కి అనే చిత్రం మన ముందుకు రానున్నాడు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ [more]

Update: 2019-06-22 05:03 GMT

గరుడ వేగా చిత్రం తో డీసెంట్ హిట్ అందుకున్న యాంగ్రీ యంగ్ మాన్ రాజశేఖర్ ప్రస్తుతం కల్కి అనే చిత్రం మన ముందుకు రానున్నాడు. ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా ఉండడంతో ఈ సినిమా కోసం ఇప్పటినుండే చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు ప్రేక్షకులు. యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో వస్తున్నా ఈసినిమా ఈనెల 28 న గ్రాండ్ గా రిలీజ్ కానుంది.

రిలీజ్ కు అన్ని విదాలుగా సిద్ధం గా ఉన్న ఈమూవీ లేటెస్ట్ గా కాపీ వివాదంలో చిక్కుకుంది. ఈమూవీ కథ తనదే అంటూ కార్తికేయ అలియాస్ ప్రసాద్ అనే రైటర్ చెబుతున్నారు. రాజశేఖర్ ‘మహంకాళి’ చేస్తున్న టైములో నేను ఆయనకు ‘కల్కి’ టైటిల్ తో కథ చెప్పాను. స్క్రిప్ట్ మొత్తం కూడా ఇచ్చేసాను. అయితే ఈ ప్రాజెక్ట్ కి బడ్జెట్ ఎక్కువ అవుతుందని…ఇంత బడ్జెట్ ఇప్పుడు పెట్టలేం అని రాజశేఖర్ అనడంతో ఆ ప్రాజెక్ట్ అప్పటిలో సెట్స్ మీదకు వెళ్లకుండా ఆగిపోయిందని..ఆ తరువాత నేను వేరే ప్రయత్నాల్లో ఉండిపోయాను. అయితే ఇప్పుడు అదే కథతో కొంచం మార్పులు చేసి మూవీ తీసారని ఆయన రైటర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశారు.

రైటర్స్ అసోసియేషన్ వారు యూనిట్ సభ్యులు ను చర్చలకు పిలిస్తే రావడం లేదని ఆయన అంటున్నారు. నాకు యూనిట్ నుండి డబ్బులు అక్కర్లేదు. జస్ట్ మూవీ లో క్రెడిట్స్ ఇస్తే చాలు అంటున్నాడు కార్తికేయ అలియాస్ ప్రసాద్

Tags:    

Similar News