కళ్యాణ్ రామ్ హ్యాండిచ్చాడా..?

Update: 2018-12-05 06:48 GMT

ఈ ఏడాది నందమూరి కళ్యాణ్ రామ్ ‘MLA’తో వచ్చి నిరాశపరిచాడు. ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న టైంలోనే తన నెక్స్ట్ రెండు మూవీస్ ను లైన్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్. ఒకటి కె.వి.గుహన్ దర్శకత్వంలో... ఇంకోటి ‘సావిత్రి’ ఫేం పవన్ సాధినేని దర్శకత్వంలో. కానీ కె.వి.గుహన్ మూవీకి మాత్రం కళ్యాణ్ డేట్స్ ఇచ్చాడు. రెండు రోజులు కిందట ఈ సినిమా టైటిల్ కూడా అనౌన్స్ చేశారు. “118” అనే టైటిల్ తో ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేశారు.

సంవత్సరం ఎదురుచూసి...

దాదాపు షూటింగ్ మొత్తం కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ రిలీజ్ కు రెడీ గా ఉంది. మరి పవన్ సాధినేనికి మాత్రం ఇంకా డేట్స్ ఇవ్వలేదట. కళ్యాణ్ తో సినిమా కోసం పవన్ ఏడాది నుండి వెయిట్ చేస్తున్నాడు. కథ విని ఓకే చేసాడు కానీ డేట్స్ మాత్రం ఇవ్వలేదు. మరి పవన్ తో కళ్యాణ్ సినిమా ఉంటుందా ? అన్న అనుమానం వచ్చింది పవన్ కి. అయితే కళ్యాణ్ రామ్ మాత్రం ఏమీ చెప్పట్లేదని తెలుస్తుంది. పవన్ ఇంక వెయిట్ చేయలేక శ్రీ విష్ణుకి ఒక లైన్ చెప్పాడట. శ్రీవిషుకి కథ నచ్చడంతో త్వరలోనే సినిమాని స్టార్ట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. అలా కళ్యాణ్ రామ్ ప్రాజెక్ట్ నుండి బయటికి వెళ్లిపోయాడు పవన్.

Similar News