పెళ్లి చేసుకుంటుంది .. సినిమాలేమైపోతాయో అనుకుంటే..?

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అని ఎన్ని రోజుల నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా కాజల్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. ఈమధ్యనే లాక్ డౌన్ లో [more]

Update: 2020-10-08 04:10 GMT

చందమామ కాజల్ అగర్వాల్ పెళ్లి అని ఎన్ని రోజుల నుండో ప్రచారం జరుగుతున్నప్పటికీ.. తాజాగా కాజల్ ఇచ్చిన షాక్ మామూలుది కాదు. ఈమధ్యనే లాక్ డౌన్ లో బిజినెస్ మ్యాన్ గౌతమ్ తో ఎంగేజ్మెంట్ చేసుకున్న కాజల్ అగర్వాల్ ఈ నెల అంటే అక్టోబర్ 30 నే పెళ్లి పీటలెక్కబోతుంది. ముంబై లోని వ్యాపారవేత్త గౌతమ్ కాజల్ పెళ్లి ఈ నెల 30 న ఓ హోటల్ లో జరగబోతుననట్టుగా తెలుస్తుంది. కరోనా ముచ్చట ముగియగానే కాజల్ గ్రాండ్ గా రిసెప్షన్ ఇస్తుందట. అయితే కాజల్ అలా సడన్ గా పెళ్లి అని చెప్పగానే ఆమెతో సినిమాలు చేస్తున్న దర్శకనిర్మాతలు ఒకింత షాకయ్యారు. కాజల్ అగర్వాల్ తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది. తెలుగులో ఆచార్య, తమిళ్ లో భారతీయుడు 2, బాలీవుడ్ లో ఓ సినిమాలో నటిస్తున్న కాజల్ పెళ్లి తరవాత ఏం చేస్తుందో అంటూ టాక్ నడుస్తుంది.

అయితే కాజల్ మాత్రం పెళ్లి తర్వాత కూడా నటిస్తాను, నాకిష్టమైన నటనను పెళ్లి తర్వాత కూడా కొనసాగిస్తానని చెప్పగానే అభిమానులకి ఆమెతో సినిమాలు ఒప్పుకున్న దర్శకనిర్మాతలకు  పెద్ద ఊరటనిచ్చింది. కరోనా వలన సింపుల్ గా పెళ్లి చేసుకుంటున్నాను, గౌతమ్ తో పెళ్లి చాలా ఆనందంగా ఉంది, మా పెళ్లి కొద్దిమంది ఆత్మీయులు, కుటుంబ సభ్యుల మధ్యనే సింపుల్ గా జరగబోతుంది… ఈ కొత్త ఆరంభం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న.. ఇన్నాళ్లుగా నాపై చూపిస్తున్న మీ ఆదరాభిమానాలకు కృతజ్ఞురాలిని, ఈ కొత్త ప్రయాణంలో మీ అందరి ఆశీస్సులు మాకు కావాలి.. ఇక పెళ్లి తర్వాత కూడా నా నటన ఆగదు. నాకుఇష్టమైన నటన కొనసాగిస్తా అంటూ సినిమాలపై కాజల్ ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది.

Tags:    

Similar News