కాజల్ భలే సీక్రెట్ బయటపెట్టిందే!!

హీరో – హీరోయిన్స్ సినిమాలో లిప్ లాక్ కిస్ లు పెట్టుకుంటారు. అవి కొన్నిసార్లు రియల్ గా తీస్తే.. మరికొన్నిసార్లు మ్యాజిక్ చేస్తుంటారు. కెమెరాలలో హీరో హీరోయిన్స్ [more]

Update: 2020-09-04 06:32 GMT

హీరో – హీరోయిన్స్ సినిమాలో లిప్ లాక్ కిస్ లు పెట్టుకుంటారు. అవి కొన్నిసార్లు రియల్ గా తీస్తే.. మరికొన్నిసార్లు మ్యాజిక్ చేస్తుంటారు. కెమెరాలలో హీరో హీరోయిన్స్ లిప్ లాక్ లను రియలిస్టిక్   గా చూపించడంలో సినిమాటోగ్రఫేర్స్ టాలెంట్ ని చూపిస్తారు. అయితే తాజాగా కాజల్ ఈ లిప్ లాక్ కిస్ సీక్రెట్ ని రివీల్ చేసింది. కాజల్ అగర్వాల్ టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోలందరితోను నటించింది. చాలామంది హీరోలతో లిప్ లాక్ కిస్ లకు సై అంది. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూ లో కాజల్ మట్లాడుతూ బ్రదర్స్ సినిమాలో నేను సూర్య లిప్ లాక్ పెట్టుకున్నట్లు ఉంటుంది. కానీ నిజానికి నేను సూర్య లిప్ టు లిప్ కిస్ చేసుకోలేదని చెబుతుంది.

బ్రదర్స్ సినిమాలో సూర్య – కాజల్ ల లిప్ లాక్ సీన్ కథ ప్రకారం ముందు లేకపోయినా.. తర్వాత ఆ సీన్ సినిమాలో ముఖ్యమని భావించడంతో.. ఆ సీన్ నాకు సూర్యకి వివరించగా.. సూర్య నాతో లిప్ లాక్ చెయ్యడానికి చాలా సిగ్గు మొహమాటం పడగ.. దర్శకుడు తమ ఇద్దరి మధ్య ఆ సీన్‌ను చాలా డ్రమాంటిక్ గా ప్లాన్ చేసి బ్లూ మ్యాట్‌ ముందు సూర్యను కుర్చీలో కూర్చోపెట్టి ఆ సీన్ ని తెరకెక్కించారు. ఓ గ్లాస్‌పై ముద్దుపెట్టించి దాన్ని తీశారని చెప్పింది. తర్వాత సూర్య కి ఎదురుగా బ్లూమ్యాట్‌తో తయారు చేసిన ఓ బొమ్మను పెట్టి దానికి ముద్దు పెట్టించారు. ఆ తర్వాత తమ ఇద్దరి ముద్దులను గ్రాఫిక్స్‌లో ఒక్కటి చేసి లిప్‌లాక్‌లా సినిమాలో చూపించారంటూ బ్రదర్స్ లిప్ లాక్ లో ఉన్న సీక్రెట్ ని కాజల్ రివీల్ చేసేసింది.

Tags:    

Similar News