అవకాశాలు లేకుంటేనే లిప్ లాక్కులా?

కాజల్ కి తెలుగులో శర్వానంద్ తో నటిస్తున్న రణరంగం తర్వాత… మెగాస్టార్ – కొరటాల సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందనే టాక్ నడుస్తుంది కానీ… ఎక్కడా [more]

Update: 2019-08-07 05:52 GMT

కాజల్ కి తెలుగులో శర్వానంద్ తో నటిస్తున్న రణరంగం తర్వాత… మెగాస్టార్ – కొరటాల సినిమాలో హీరోయిన్ గా అవకాశం వచ్చిందనే టాక్ నడుస్తుంది కానీ… ఎక్కడా కన్ఫర్మేషన్ లేదు. ఇక తమిళం లో మాత్రం కమల్ హాసన్ సరసన ఇండియన్ 2 సినిమాలో కాజల్ నటిస్తుంది. కమల్ హాసన్ – శంకర్ కాంబోలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ ఇండియన్ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కొన్ని కారణాలతో షూటింగ్ కి బ్రేక్ పడింది. తాజాగా ఇండియన్ 2 షూటింగ్ మళ్ళీ మొదలు కాబోతుంది. ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ తో పాటుగా రకుల్ ప్రీత్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది. భారతీయుడు లో మనీషా కొయిరాలా, ఊర్మిళ లు కమల్ తో రొమాన్స్ చేశారు. మరి ఇండియన్ 2 లోను కాజల్, రకుల్ లు కమల్ తో రొమాంటిక్ గా రెచ్చిపోతారట.

లిప్ లాక్ కు……

అయితే కమల్ సినిమాలంటే ఖచ్చితంగా లిప్ లాక్స్ ఉండాలి. మరి కాజల్, రకుల్ ఇప్పటివరకు పెద్దగా లిప్ లక్స్ ఉన్న సీన్స్ లో ఎక్కువగా నటించలేదు. కొన్ని సినిమాల్లో నటించినా వాటిని అంతగా హైలెట్ కానివ్వలేదు. మరి ప్రస్తుతం అవకాశాలు చేజారుతున్న తరుణంలో కమల్ తో ఈ భామామణులిద్దరూ లిప్ లాక్స్ కి సై అన్నట్టుగానే కనబడుతుంది. కమల్ సరసన మొదటిసారి జోడీకడుతున్న ఈ హీరోయిన్స్ ఇద్దరూ లిప్ లాక్స్ కి బాగా ప్రిపేర్ అయి ఇండియన్ 2 కి సైన్ చేసినట్లుగా తెలుస్తుంది. అసలే అవకాశాలు లేని టైం లో ఏదో ఒకటి అని సర్దుకుపోతున్నట్లుగా ఉంది వీరి యవ్వారం.

Tags:    

Similar News