కాజల్ అగర్వాలూ.. క్వాంటం ఫిజిక్సు…!

కరోనా లాక్ డౌన్ ని  ఎలా ఫీలవుతున్నారు? ఎమన్నా ఒత్తిడికి లోనవుతున్నారా? అని కాజల్ అగర్వాల్ ని అడగగా.. జీవితంలో ఎన్నో కఠినమైన సవాళ్ళను ఎదుర్కొన్నాను. అలాంటి [more]

Update: 2020-05-27 07:22 GMT

కరోనా లాక్ డౌన్ ని ఎలా ఫీలవుతున్నారు? ఎమన్నా ఒత్తిడికి లోనవుతున్నారా? అని కాజల్ అగర్వాల్ ని అడగగా.. జీవితంలో ఎన్నో కఠినమైన సవాళ్ళను ఎదుర్కొన్నాను. అలాంటి సందర్భంలోనే నేను ఒత్తిడికి లోను కాలేదు. ఈ కరోనా లాక్ డౌన్స్ సమయంలోను నెను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదు అంటుంది. కారణం ఆన్ లైన్ లో కాజల్ అగర్వాల్ క్లాస్ లు విటుందట. సమస్యలొచ్చాయి కదా అని భయపడలేదు. ఒకరకంగా అలాంటి క్లిష్ట పరిస్థితులే మనకి జీవిత పాటలు నేర్పుతాయంటుంది కాజల్ అగర్వాల్. అంతే కాదు ఇలాంటి సమయాల్లోనే మన బలం ఏమిటి.. మన శక్తీ ఏమిటి అనేది బయటికి వస్తుంది.

అసలు ఇప్పుడు ఈ కరోనా లాక్ డౌన్ సమయంలో నేనేమి ఒత్తిడికి గురి కావడం లేదు. ఒక రకంగా ఈ ఖాళీ సమయాన్ని నేను చక్కగా సద్వినియోగించుకుంటున్నా. నా వంట నేను వండుకుంటున్నాను… నా పనులు నేనే చేసుకుంటున్నా. అలాగే గతంలో షూటింగ్స్ తో బిజీగా ఉండి.. కొన్ని బుక్స్ చదవలేకపోయాను. అలాంటి బుక్స్ అన్ని ఇప్పుడు చదివేస్తున్నా అంటుంది కాజల్. ఇక కాజల్ అగర్వాల్ ఈ లాక్ డౌన్ సమయంలో ఓ మంచి పని చేస్తుందట. ఆదేమిటంటే ఆన్ లైన్ లో న్యూరో సైన్స్, క్వాంటం ఫిజిక్స్ లాంటి కొత్త కోర్సులు ని నేర్చుకుంటున్నా అంటూ కరోనా లాక్ డౌన్ సమయంలో కాజల్ అగర్వాల్ ఏం చేస్తుందో చెబుతుంది.

Tags:    

Similar News