అతడి రొమాన్స్ తో ఇబ్బంది పడ్డాను

ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ నటిస్తూ..అటు తెలుగులోనూ, తమిళంలోను సినిమాల్లో బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె మంచులక్ష్మి హోస్ట్‌గా చేస్తోన్న [more]

Update: 2019-10-26 07:48 GMT

ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కమల్ హాసన్ తో ‘భారతీయుడు 2’ నటిస్తూ..అటు తెలుగులోనూ, తమిళంలోను సినిమాల్లో బిజీగా ఉంది. రీసెంట్ గా ఆమె మంచులక్ష్మి హోస్ట్‌గా చేస్తోన్న ‘ఫిట్ అప్ విత్ స్టార్స్’ అనే ప్రోగ్రామ్‌లో పాల్గొన్నారు. ఈ ప్రోగ్రాం లో మంచు లక్ష్మి అడిగిన ప్రశ్నకు చాలా ఇంట్రెస్టింగ్ సమాధానం చెప్పింది. మీరు ఇప్పటివరకు నటించిన సినిమాల్లో ఏ నటుడితో అయినా రొమాన్స్ చేసేటప్పుడు ఇబ్బంది పడ్డారా? అని అడిగిన ప్రశ్నకు కాజల్ మోహమాటం లేకుండా సమాధానం చెప్పింది.

ఆ సన్నివేశాలంటే…

తాను హిందీ లో 2016లో నటించిన ‘దో లఫ్జోన్‌ కే కహనీ’ చిత్రం గురించి మాట్లాడుతూ…” ఈ మూవీలో నేను అంధురాలి పాత్రను పోషించాను. అందులో నా ప్రియుడు రణదీప్‌. మా ఇద్దరి మధ్య ప్రేమను చూపించడానికి కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను చిత్రీకరించింది చిత్ర బృందం. అప్పుడు ఆ సన్నివేశాలు చిత్రిస్తున్న టైములో రణదీప్‌ తో రొమాన్స్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాను అని..నాకు తెలియని ఒక వ్యక్తితో అలాంటి రొమాంటిక్ సీన్స్‌లో నటించడం చాలా ఇబ్బందిగా అనిపించింది” అని పేర్కోంది. ప్రస్తుతం ఈమె ‘కాల్‌ సెంటర్‌’, ‘ముంబయి సాగా’, ‘భారతీయుడు 2’ చిత్రాల్లో నటిస్తోంది.

 

Tags:    

Similar News