వెబ్ సిరీస్ లోకి కాజల్!

టాలీవుడ్ చందమా తెలుగులో ఇప్పటికే అందరి హీరోస్ తో నటించింది. టాలీవుడ్ లో ఈ మధ్య ఆమెకు అవకాశాలు తక్కువయ్యాయి. కారణం సరైన కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ [more]

Update: 2019-09-14 06:16 GMT

టాలీవుడ్ చందమా తెలుగులో ఇప్పటికే అందరి హీరోస్ తో నటించింది. టాలీవుడ్ లో ఈ మధ్య ఆమెకు అవకాశాలు తక్కువయ్యాయి. కారణం సరైన కథలు ఎంచుకోవడంలో ఫెయిల్ అవుతుంది కాబట్టి. ప్రస్తుతం ఈమె చేతిలో తెలుగులో అయితే ఏ సినిమాలు లేవు. తమిళంలో మాత్రం ‘ఇండియన్ 2’ లో మాత్రమే నటిస్తుంది. ఈ ఒక్క సినిమా తప్ప ఆమె ఏ సినిమాలోనూ నటించడంలేదు. ఇందుకేనేమో కాజల్ మరో మాస్టర్ ప్లాన్ చేసింది.

ఇక్కడైనా రాణిస్తుందా….

కాజల్ కూడా అందరిలానే వెబ్ సిరీస్ లోకి ఎంట్రీ ఇస్తుంది. తమిళ డైరెక్టర్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో ఈ వెబ్ సిరీస్ తెరకెక్కుతోంది. నిన్నటి నుంచి ఈ వెబ్ సిరీస్ షూటింగ్ లో కాజల్ పాల్గొంది. తమిళంలో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ ని హాట్ స్టార్ వారు నిర్మిస్తున్నారు. తెలుగు లో దీన్ని డబ్ చేసే అవకాశం ఉందని తెలుస్తుంది. సినిమాల్లో ఆమెకు అవకాశాలు తక్కువ అవ్వడంతో ఈ నిర్ణయం తీసుకుంది కాజల్. అలానే ఈమె చిన్న బడ్జెట్ లో సినిమా లు నిర్మించాలనుకుంటుంది. ప్రస్తుతం తన టీం తో కూర్చుని డిస్కషన్స్ చేస్తునట్టు తెలుస్తుంది.

 

 

 

 

Tags:    

Similar News