ఇంతకీ ఐటెం సాంగ్ లోనా.. హీరోయిన్ గానా?

ఆచార్య సినిమాలో చిరు సరసన నటించేందుకు హీరియిన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. త్రిషని పట్టుకొస్తే ఆమె మధ్యలో వదిలేసి వెళ్ళింది. అలాగే అనుష్క ని సంప్రదిస్తే ఆమె [more]

Update: 2020-03-23 09:17 GMT

ఆచార్య సినిమాలో చిరు సరసన నటించేందుకు హీరియిన్స్ పెద్దగా ఆసక్తి చూపలేదు. త్రిషని పట్టుకొస్తే ఆమె మధ్యలో వదిలేసి వెళ్ళింది. అలాగే అనుష్క ని సంప్రదిస్తే ఆమె నో చెప్పింది అనే టాక్ నడిచింది. చివరికి ఖైదీ నెంబర్ 150 తో జోడి కట్టిన కాజల్ అగర్వాల్ ఫైనల్ అయ్యింది. ఆ విషయాన్నీ కాజల్ స్వయంగా చెబుతుంది. ప్రస్తుతం కరోనా తో ఖాళీగా ఉన్న కాజల్ సోషల్ మీడియాలో అభిమానుల చిట్ చాట్ లో పాల్గొంది. అందులో ఒకరు మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్ ఏమిటి అని అడగగా…. తెలుగులో చిరు సినిమా లో చేస్తున్నా అంటూ చిరు ఆచార్య లో కాజల్ అగర్వాల్ తానే నటిస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసింది. అయితే కాజల్ అగర్వాల్ ఆచార్య సినిమాలో హీరోయిన్ గా నటిస్తుందా?

లేదంటే కేవలం ఒక స్పెషల్ సాంగ్ కే పరిమితమవుతుందా అనే గాసిప్ బయలుదేరింది. ఇప్పటికే ఆచార్య సినిమాలో చిరు తో ఐటెం సాంగ్ ని రెజినా కాసాండ్రా చేసింది. ఆ విషయాన్ని రెజీనా ఎప్పుడో చెప్పింది. ఇప్పటికే ఆ సాంగ్ షూట్ కూడా పూర్తయ్యింది. ఇక తాజాగా త్రిష ప్లేస్ లోకే కాజల్ అగర్వాల్ వచ్చింది. కానీ బయట మాత్రం అంటే సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ ఆచార్య లో ఓ స్పెషల్ సాంగ్ మాత్రమే చేస్తుంది. హీరోయిన్ కాదంటూ ప్రచారం జరుగుతుంది కానీ.. అది నిజం కాదని.. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గానే నటిస్తుంది అని మూవీ టీం క్లారిటీ ఇచ్చింది.

Tags:    

Similar News