కాజల్ ఈసారి అలా

Update: 2018-12-18 04:11 GMT

స్టార్ హీరో కమల్ హాసన్ - శంకర్ దర్శకత్వంలో వచ్చిన 'భారతీయుడు' అప్పటిలో ఎన్ని అంచనాలు క్రియేట్ చేసిందో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు దానికి సీక్వెల్ ను తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ శంకర్. 'భారతీయుడు 2 ' గా వస్తున్న ఈసినిమాకు సంబంధించి పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుతున్నాయి.

'భారతీయుడు' లో సీనియర్ కమలహాసన్ తనపై దాడికి దిగినవారిపై ఒక ప్రాచీన యుద్ధ విద్యను ప్రయోగించి మట్టి కరిపిస్తుంటాడు. అయితే ఇప్పుడొచ్చే సీక్వెల్ లో కూడా మరో ప్రాచీన యుద్ధ విద్యను మనకు చూపించనున్నాడు శంకర్. ఇందులో 'వర్మకళ'(తెలుగు లో) అనే ప్రాచీన యుద్ధకళను చూపించనున్నాడు.

కమల్ హాసన్ సరసన కాజల్ హీరోయిన్ గా నటిసున్న సంగతి తెలిసిందే. అయితే కథ ప్రకారం ఈ సినిమాలో కాజల్ కూడా 'వర్మకళ'ను ప్రయోగించే సన్నివేశాలు వున్నాయట. ఆ కళ కు సంబంధించి కాజల్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటుందట. సో త్వరలోనే కాజల్ ను మరో యాంగిల్ లో చూడనున్నారు తన ఫ్యాన్స్. జనవరి లో సెట్స్ మీదకు వెళ్లే ఈసినిమా ను లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్నారు.

Similar News