అఖిల్ మూవీలో టాలీవుడ్ చందమామ

Update: 2018-09-13 07:14 GMT

నాగార్జున చిన్న కొడుకు అఖిల్ అక్కినేని ప్రస్తుతం 'తొలిప్రేమ' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అఖిల్ కి జోడిగా నిధి అగర్వాల్ నటిస్తున్నా ఈసినిమాలో మరో హీరోయిన్ ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ విషయాన్నీ చిత్ర యూనిట్ చాలా గోప్యంగా ఉంచినట్టు తెలుస్తుంది. ఎందుకని ఆ విషయాన్నీ అంత సీక్రెట్ గా ఉంచారన్నది తెలియాల్సిఉంది. అయితే ఆ హీరోయిన్ ఎవరు అయ్యి ఉంటారని గత కొన్ని రోజులు నుండి సోషల్ మీడియాలో చర్చ జరుగుతుంది.

అయితే తాజా సమాచారం ప్రకారం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఆ హీరోయిన్ అని తెలిసింది. అయితే ఆమె ఇందులో ఎటువంటి పాత్ర చేస్తుందో అన్నదానిపై ఇంకా క్లారిటీ రావాలి. కాజల్ కు తెలుగులో ఈమధ్య అవకాశాలు తగ్గిన మాట వాస్తవమే గానీ అలా అని సపోర్టింగ్ రోల్ చేసేది మాత్రం సందేహమే. మరి సెకండ్ హీరోయిన్ గా చేస్తదా? అన్న ప్రశ్న కూడా వెంటాడుతుంది. ఒకేవేళ సెకండ్ హీరోయిన్ గా చేయాల్సి వచ్చిన అఖిల్ పక్క ఆమె సెట్ అవుతుందా? అన్న ప్రశ్న కూడా వేస్తున్నారు.

మరి వెంకీ అట్లూరి కాజల్ పాత్రను ఎలా డిజైన్ చేసాడో. ఇక ఈసినిమాకి 'Mr. మజ్ను' అని టైటిల్ ఫిక్స్ చేసినట్టు సమాచారం. ప్రస్తుతం జెట్ స్పీడ్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈసినిమాను అక్కినేని ఫ్యామిలీకి బాగా కలిసొచ్చిన డిసెంబర్ నెలలో రిలీజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. కనీసం ఈసినిమాతో ఐన అఖిల్ మొదటి సక్సెస్ అందుకుంటాడో లేదో చూడాలి. అయితే అక్కినేని ఫ్యాన్స్ మాత్రం ఈసినిమాపై చాలా హోప్స్ పెట్టుకున్నారు

Similar News