కాజల్ మెరుపు తగ్గలేదు బాబోయ్

Update: 2018-04-09 05:26 GMT

ప్రస్తుతం టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ కి పెద్దగా క్రేజ్ లేదు. కావాలనే కొన్ని అవకాశాలు చేజార్చుకుంటూ ప్రస్తుతంఖాళీగా ఉంటుంది. కుర్ర హీరోలు ఇప్పటికి కాజల్ కోసం ఎదురు చూస్తున్నవారున్నారు. వారు తమ సినిమాల్లో పిలిచి అవకాశం ఇస్తాం అంటే కోట్లు కావాలని డిమాండ్ చేస్తుంది. ఇక సీనియర్ హీరో వెంకటేష్ పక్కన 'ఆట నాదే వేట నాదే' సినిమాలో చెయ్యనని ఖరా ఖండిగా చెప్పేసింది. అలాగే శర్వానంద్ పక్కన కూడా పారితోషకం కారణంగానే సినిమాని వదులుకుందనే టాక్ ఉంది. మరొపక్కన అడిగినంత ఇస్తున్నారు కదా అని బెల్లంకొండ శ్రీనివాస్ పక్కన వచ్చిన ఛాన్స్ ని పట్టేసింది.

ఇక కాజల్ అగర్వాల్ అందాల ఆరబోతకు ఎప్పుడూ సై అనేది. కాకపోతే బాలీవుడ్ లో ఆరబోసినట్టుగా టాలీవుడ్ లో ఆరబోసేది కాదు కానీ... ఇక్కడ కూడా గ్లామర్ డాల్ ల పర్వాలేదనిపించేది. చిరు పక్కన ఖైదీలోను కాజల్ అందాల ఆరబోత మాములుగా రాలేదు. ఇక ఫంక్షన్స్ కి , అవార్డ్స్ ఫంక్షన్స్ కి హాజరయ్యే కాజల్ అగర్వాల్ బొమ్మలాగా అదిరిపోయే దుస్తులతో క్లివేజ్ షోతో రచ్చ రచ్చ చేస్తుంది. ఒకసారి బాలీవుడ్ లో ఫిలిం ఫర్ అవార్డ్స్ కి హాజరయిన కాజల్ అగర్వాల్ ఆ ఫంక్షన్ కి వేసిన డ్రెస్సు తో తెగ హైలెట్ అయ్యింది. ఆ పింక్ కలర్ గౌన్ లో కాజల్ అందాల విందు మాములుగా లేదు.

అయితే తాజాగా కాజల్ టాలీవుడ్ ప్రియులకు కూడా అలాంటి అందాల విందునే ఇచ్చింది. గత రాత్రి జీ తెలుగు ఎంతో ప్రతిష్ట్మాకంగా నిర్వహిస్తున్న అప్సర అవార్డ్స్ కోసం కాజల్ వేసిన డ్రెస్సు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బ్లాక్ డ్రెస్ లో ఈ ఫంక్షన్ కి అటెండ్ అయిన కాజల్.. తన డ్రెసింగ్ మెరుపులతో... తనలోని మెరుపు ఇంకా తగ్గలేదని... నిరూపించింది. మరి ఆ డ్రెస్సులో కాజల్ అందాల విందు కి చూపరుల మతులు పోయాయి. ఇక కాజల్ తనేమాత్రం తగ్గేది లేదని... అక్కడ ఫోటో గ్రఫేర్స్ కి చేతినిండా పనిచెప్పింది. అందమైన ఫోజులతో అదరగొట్టేసింది టాలీవుడ్ చందమామ.

Similar News