చిరు మోస్ట్ రొమాంటిక్ పర్సన్ అన్న టాప్ హీరోయిన్

Update: 2018-04-09 06:39 GMT

హీరోలపై తన అభిప్రాయాన్ని చెప్పడం కాజల్ అగర్వాల్ స్టైల్. గతంలో తమిళ్ హీరో విజయ్ పై సెన్సేషనల్ కామెంట్స్ చేసి అందరి దృష్టిలో పడింది. విజయ్ కు అసలు టేస్ట్ ఉండదని.. అతను ట్రెండ్ ఫాలో అవ్వటంతో చాలా వీక్ అని చెప్పడంతో ఆ మాటలు దుమారం రేపాయి. అయితే లేటెస్ట్ గా కొంతమంది తెలుగు హీరోలపై తన అభిప్రాయాన్ని ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకొచ్చింది.

నా తెలిసినంత వరకు చిరంజీవి గారు మోస్ట్ రొమాంటిక్ హీరో అని అంది. నేను చాలా మంది హీరోస్ తో యాక్ట్ చేశా కానీ చిరంజీవి అంత రొమాంటిక్ గా నాకు ఎవరూ కనిపించలేదు. ఇక నేను వర్క్ చేసిన హీరోల్లో మహేష్ బాబు చాలా సైలెంట్ గా ఉంటారు. మ్యాగ్జిమమ్ కామ్ గా ఉండడానికి ట్రై చేస్తాడు. మాట్లాడితే మాత్రం జోకులు పేలుస్తుంటాడు.

రీసెంట్ గా జరిగిన ఓ అవార్డు ఫంక్షన్ లో కాజల్ మన తెలుగు హీరోస్ గురించి తన అభిప్రాయాన్ని బయటపెట్టింది. అయితే ఇదే ఫంక్షన్ లో ఫ్యాషన్ ని ఫాలో అవ్వడంతో అల్లు అర్జున్ ని మించినోడు లేదని చెప్పింది. టాలీవుడ్ లో నన్ను లవ్ లో పడేయాలి అని ఎవరు ట్రై చేయలేదు.. కానీ రెండుమూడు సార్లు నవదీప్ ట్రై చేశాడని చెప్పుకొచ్చింది మిల్క్ బ్యూటీ కాజల్.

Similar News