మళ్ళీ కాజల్ తో సినిమానా?

కాజల్ ని లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు దర్శకుడు తేజ. ఆ కృతజ్ఞతతోనే కాజల్ అగర్వాల్ అట్టర్ ప్లాప్స్ లో ఉన్న [more]

Update: 2019-06-13 07:38 GMT

కాజల్ ని లక్ష్మి కళ్యాణం సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసాడు దర్శకుడు తేజ. ఆ కృతజ్ఞతతోనే కాజల్ అగర్వాల్ అట్టర్ ప్లాప్స్ లో ఉన్న తేజకి నేనే రాజు నేనే మంత్రి సినిమా చేసింది. ఆ సినిమా మొత్తం కాజల్ చుట్టూనే తిరుగుతుంది. అది కూడా ఆ సినిమా కాజల్ ఒప్పుకోవడానికి ఓ కారణం. ఆ సినిమా హిట్ తర్వాత తేజ నెక్స్ట్ సినిమా సీత ని కూడా కాజల్ చేసింది. సీత సినిమా కథ మొత్తం కాజల్ అగర్వాల్ చుట్టూ తిరిగేలా రాసుకున్న తేజకి కాజల్ ఆ సినిమా చెయ్యడం ప్లస్ అయ్యింది. కానీ ఆ సినిమాని ప్రేక్షకులు రిజెక్ట్ చేశారు. ప్రస్తుతం కాజల్ తెలుగులో శర్వానంద్ తో మాత్రమే నటిస్తుంది. తమిళనాట రెండు మూడు సినిమాలు అమ్మడు చేతిలో ఉన్నాయి.

సీత సినిమాతో భారీ డిజాస్టర్ అందుకున్న తేజ అప్పుడే మరో సినిమా స్క్రిప్ట్ మీద కూర్చున్నాడట. అయితే ఆ సినిమాని కూడా కాజల్ తోనే తేజ చేయబోతున్నాడనే ప్రచారం మొదలైంది. సీత సినిమాకి కాజల్ అంతగా ప్రమోట్ చేసినా సినిమా మాత్రం హిట్ కాలేదు. అయితే ఈసారి మంచి స్క్రిప్ట్ తో కాజల్ కి సూపర్ హిట్ ఇస్తానని తేజ మాటిచ్చినట్లుగా సోషల్ మీడియా టాక్. అయితే ఈ సినిమాని కూడా సీత సినిమాలా పక్కా లేడి ఓరియెంటెడ్ గా ఉండబోతుందనేది లేటెస్ట్ న్యూస్. అయితే తేజ మళ్ళీ కాజల్ తో సినిమా ఏంటి అంటూ కాజల్ అభిమానులు టెంక్షన్ పడుతున్నారట.

Tags:    

Similar News