హీరోయిన్ కాకపోతే వ్యోమగామి అయ్యేదట

ఎవరైనా ఓ హీరోయిన్ ని మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అంటే…వాళ్లు టక్కున ఏ డాక్టరో, ఏ ఫ్యాషన్ డిజైనరో అయ్యేవాళ్ళం అంటూ టక్కున చెప్పేస్తారు. [more]

Update: 2019-11-19 05:12 GMT

ఎవరైనా ఓ హీరోయిన్ ని మీరు హీరోయిన్ కాకపోయి ఉంటే ఏమయ్యేవారు అంటే…వాళ్లు టక్కున ఏ డాక్టరో, ఏ ఫ్యాషన్ డిజైనరో అయ్యేవాళ్ళం అంటూ టక్కున చెప్పేస్తారు. కానీ ఓ హాట్ హీరోయిన్ మాత్రం తాను హీరోయిన్ అవ్వకపోయి ఉంటే వ్యోమగామి గా అయ్యేదాన్ని అని చెబుతుంది. ఆమె ఎవరో కాదు… ఈ వయసులోనూ ఇంకా హాట్ హాట్ గా గ్లామర్ షో చేస్తున్న కాజల్ అగర్వాల్. మూడు పదుల వయసు దాటినా… ఇంకా హీరోయిన్ గా కెరీర్ లో దూసుకుపోతున్న కాజల్ అగర్వాల్ ఇంకా కత్తిలాంటి ఫిగర్ ని మైంటైన్ చేస్తూ యంగ్ బ్యూటీస్ కి గట్టి పోటీ ఇస్తుంది. ప్రస్తుతం కమల్ హాసన్ సరసన ఇండియాన్ 2 లో నటిస్తున్న కాజల్ అగర్వాల్ ని ఓ మీడియా మిత్రుడు ఈ ప్రశ్న వేసాడు.

మీరు నటిగా కాకపోయి ఉంటే.. ఏమయ్యేవారు అనే దానికి కాజల్ తడుముకోకుండా నేను నటిని కాకపోయి ఉంటే… వ్యోమగామిగానో, లేదంటే హెయిర్ స్పెషలిస్ట్ నో అయ్యుండేదానిని అని చెబుతుంది. సైన్స్ అంటే ఇష్టమని, అలాగే చిన్నప్పటినుండి జుట్టుని రకరకాల డిజైన్స్ తో అల్లడం ఇష్టమని చెబుతున్న కాజల్ అగర్వాల్ చిన్నప్పుడు తన చెల్లి నిషా అగర్వాల్ కి డబ్బులిచ్చి మరీ.. తన జుట్టుని రకరకాల డిజైన్స్ తో అలంకరించేదానిని… కానీ అలా అనుకోకుండా హీరోయిన్ అయ్యానని చెబుతుంది కాజల్

Tags:    

Similar News