సీనియర్ హీరోలకే ఫిక్స్ అవుతుందా

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో సర్దుకుపోతుంది. అమ్మడుకి స్టార్ అండ్ యంగ్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వడం లేదుకానీ, తెలుగు, తమిళ, హిందీలోనూ సీనియర్ హీరోల [more]

Update: 2019-11-28 10:55 GMT

ప్రస్తుతం రకుల్ ప్రీత్ సింగ్ సీనియర్ హీరోలతో సర్దుకుపోతుంది. అమ్మడుకి స్టార్ అండ్ యంగ్ హీరోలెవరు అవకాశాలు ఇవ్వడం లేదుకానీ, తెలుగు, తమిళ, హిందీలోనూ సీనియర్ హీరోల సరసనే ఛాన్సులొస్తున్నాయి. అయితే తాజాగా మరో హీరోయిన్ కూడా సీనియర్ హీరోల చెంతకు చేరేలా కనబడుతుంది. ఇంతకుముందు చిరంజీవి ఖైదీ నెంబర్ 150 లో నటించిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు మరో సీనియర్ హీరో సినిమా కోసం గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందనే న్యూస్ వినబడుతుంది.

మన్మధుడు 2 లో రకుల్ లాంటి యంగ్ హీరోయిన్ తో రొమాన్స్ చేసిన నాగార్జున… ఇపుడు కాజల్ అగర్వాల్ తో జోడికట్టబోతున్నాడట. ఆఫీసర్, దేవదాస్, మన్మధుడు 2 సినిమాల ప్లాప్స్ తర్వాత నాగార్జున సాల్మన్ అనే కొత్త దర్శకుడితో సినిమా చెయ్యబోతున్నాడు. కళ్యాణ్ కృష్ణ బంగార్రాజుని పక్కనబెట్టి మరీ సాల్మన్ అనే కొత్త దర్శకుడుకి కమిట్ అయిన నాగ్ ఈ సినిమాలో ఓ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నాడట. మరి నాగార్జున కోసం శ్రియ, అనుష్క, నయనతార కాకుండా లేటెస్ట్ గా సీనియర్ హీరోయిన్ లిస్ట్ లోకి వెళ్లిన కాజల్ అగర్వాల్ అయితే బావుటనుందని నాగ్ కి ఫైనల్గా కాజల్ నే సెట్ చేస్తున్నారట. మరి గతంలో రామ్ చరణ్ సరసన మగధీరతో నటించిన కాజల్, తర్వాత చిరు సరసన ఖైదీ నెంబర్ 150 లో నటించింది. ఇక నాగ చైతన్య తో దడ అనే ప్లాప్ మూవీలో నటించిన కాజల్ ఇప్పుడు తండ్రి నాగ్ తో జోడికట్టబోతుందన్నమాట

Tags:    

Similar News