చందమామ పెళ్లి పీటలెక్కుతుందా?

పెళ్లివయసు దాటిపోయినా.. పెళ్లి ఊసెత్తకుండా సినిమాలు చేసుకుపోతున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ వార్తలొస్తున్నాయి. చాలాకాలంగా కాజల్ పెళ్లి విషయంలో రకరకాల న్యూస్ [more]

Update: 2019-11-03 04:35 GMT

పెళ్లివయసు దాటిపోయినా.. పెళ్లి ఊసెత్తకుండా సినిమాలు చేసుకుపోతున్న టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లి పీటలెక్కబోతుందంటూ వార్తలొస్తున్నాయి. చాలాకాలంగా కాజల్ పెళ్లి విషయంలో రకరకాల న్యూస్ లు ప్రచారంలోకొచ్చినా.. వాటిని కాజల్ సున్నితంగా కొట్టి పడేస్తుంది. కెరీర్ లో ఇంకా దూసుకుపోవాలంటూ లెక్చర్ ఇచ్చే కాజల్ కి త్వరలోనే పెళ్లి అంటున్నారు. ఇప్పటికే కాజల్ చెల్లి నిషా అగర్వాల్ పెళ్లి చేసుకుని పిల్లాడికి కూడా తల్లయ్యింది. కానీ కాజల్ ఇంకా ఒంటరే.

అయితే కాజల్ ప్రేమ పెళ్లి చేసుకోవడం లేదని, పెద్దల కుదిర్చిన వివాహం చేసుకోబోతుందట. కాజల్ ఫ్యామిలీ మెంబెర్స్ ఓ వ్యాపార వేత్తతో కాజల్ కి పెళ్లి సంబంధం ఫిక్స్ చేసినట్లుగా తెలుస్తుంది. గతంలోనే కాజల్ ఇప్పటివరకు ప్రేమలో పడలేదని.. అలాగే సినిమా ఇండస్ట్రీలోని వ్యక్తులని పెళ్ళాడనని తెగేసి చెప్పింది. మరి ఇప్పుడు కాజల్ ని పెళ్లి చేసుకోబోయే ఆ వ్యాపారవేత్త ఎవరో అంటూ ఫాన్స్ తెగ ఫీల్ అవుతున్నారు. ఏది ఏమైనా లక్ష్మి కళ్యాణం తో ఎంట్రీ ఇచ్చిన కాజల్ టాప్ హీరోయిన్ గా చక్రం తిప్పి…. ప్రస్తుతం కూడా బిజీ గా సినిమాలు చేసుకుంటూ.. ఇప్పుడు పెళ్లితో సెటిల్ కూడా కాబోతుందన్నమాట.

Tags:    

Similar News