బన్నీ తో కాజల్

కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మల్లి ఫామ్ లోకొచ్చేసింది అనుకుంటే.. రీసెంట్ గా వచ్చిన సీత సినిమా కాజల్ ఆశల మీద నీళ్లు [more]

Update: 2019-06-10 07:12 GMT

కాజల్ అగర్వాల్ నేనే రాజు నేనే మంత్రి సినిమాతో మల్లి ఫామ్ లోకొచ్చేసింది అనుకుంటే.. రీసెంట్ గా వచ్చిన సీత సినిమా కాజల్ ఆశల మీద నీళ్లు చల్లింది. అయినా తమిళంలో రెండు సినిమాల్తో పాటుగా.. తెలుగులో శర్వానంద్ తో కాజల్ అగర్వాల్ ఒక సినిమాలో నటిస్తుంది. అయితే కాజల్ కి హీరోయిన్ గానే కాదు.. ఐటెం సాంగ్స్ లోను మంచి పేరుంది. ఎన్టీఆర్ కోసం జనతా గ్యారేజ్ లో నేను పక్కా లోకల్ అంటూ చిందులేసి మెప్పించింది. ఆ సాంగ్ అప్పట్లో ఓ ఊపు ఊపింది. మరి అడిగినంత ఇస్తే ఐటెం అయితే ఏమైంది అనేలా కాజల్ ఆ సాంగ్ కి స్టెప్పులేసింది.

తాజాగా మరో సినిమాలో కాజల్ ఐటెం సొగ్ చెయ్యబోతుందనే న్యూస్ స్ప్రెడ్ అయ్యింది. అది కూడా అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబోలో తెరకెక్కుతున్న సినిమా కోసం కాజల్ అగర్వాల్ ఐటెం పాప అవతారమెత్తబోతుందంటున్నారు. ఆ సినిమాలో పూజ హెగ్డే, నివేత పేతురేజ్ హీరోయిన్స్ గా నటిస్తుండగా కాజల్ ఐటెం సాంగ్ కోసం రాబోతుందట. మరి సూపర్ డాన్సర్ ఎన్టీఆర్ తో కలిసి పక్కా లోకల్ అంటూ కత్తిలాంటి స్టెప్స్ తో చంపేసిన కాజల్.. ఇప్పుడు మరో సూపర్ డాన్సర్ బన్నీ తో కలిసి ఎలాంటి స్టెప్స్ తో ఇరగదీస్తుందో అంటూ మెగా ఫాన్స్ చొంగలు కారుస్తున్నారు.

Tags:    

Similar News