కాజల్ ని నమ్ముకుంటే దెబ్బేసేసింది

కవచం సినిమా అప్పుడు, సీత సినిమా అప్పుడు టాప్ అండ్ గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని నమ్ముకుంటే … బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి దెబ్బే [more]

Update: 2019-05-27 11:34 GMT

కవచం సినిమా అప్పుడు, సీత సినిమా అప్పుడు టాప్ అండ్ గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని నమ్ముకుంటే … బెల్లంకొండ శ్రీనివాస్ కి మంచి దెబ్బే పడింది. కాజల్ టాప్ హీరోయిన్ కదా… తన హీరోయిజాన్ని చూపిస్తూ కాజాల అందాలను, క్రేజ్ ని నమ్ముకుంటే చాల్లే అనుకున్న బెల్లంకొండకి బాగా తెలిసొచ్చింది. వరసగా కవచం, సీత సినిమాలు దెబ్బేసాయి. కవచం కన్నా సీత సినిమా అప్పుడు దర్శకుడు తేజ, నిర్మాత, బెల్లంకొండ శ్రీనివాస్ కూడా కాజల్ నే నమ్ముకున్నారు. ఆఖరుకి బాయ్ర్లు కూడా కాజల్ ని చూసే సీత సినిమాని కొన్నారు.

కానీ సినిమా విడుదలయ్యాక సీన్ సితార అయ్యింది. కాజల్ అందాలు, గ్లామర్, క్రేజ్ ఏమి సీత సినిమాని గట్టెక్కించలేకపోయాయి. సీత సినిమా మొదటి మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కేవలం 4.2 కోట్ల షేర్ వసూలు చేసింది. మరి వీకెండ్ కావడంతో కలెక్షన్స్ పర్వాలేదనిపించింది…. సీత అసలు రంగు నేడు సోమవారం కానీ బయటపడేలా లేదు. టాక్ కాస్త బావున్నా.. సీత సినిమా ఆడేసేదే. ఎందుకంటే వేసవి సెలవలు చివరిలో విడుదలైన సీత సినిమా కి టాక్ బావుంటే హిట్ అయ్యేదే. కానీ పాజిటివ్ టాక్ పడలేదు. ఇక కాజల్ ని నమ్ముకుని థియేటర్స్ కెళ్లిన ప్రేక్షకుల….. కి చిరాకు పెట్టేలా సినిమా ఉండడంతో…వారు పెదవి విరుపులతో సీత సినిమా కి బాగా దెబ్బపడింది. మరి ఈ వరస ప్లాప్స్ తో బెల్లంకొండ కాజల్ ని నమ్ముకుంటే ఇలా అయ్యింది చెప్మా అంటూ ఉసూరుమంటున్నాడట

Tags:    

Similar News