కాజల్ అంత తీసుకోవడంలో తప్పేముంది?

Update: 2018-11-25 11:42 GMT

స్టార్ హీరోస్ నుండి చిన్న హీరోస్ వరకు అందరితో నటిస్తా అంటుంది కాజల్ అగర్వాల్. తెలుగు ఇండస్ట్రీకి వచ్చి దాదాపు దశాబ్దం అవుతున్న ఈమె క్రేజ్ మాత్రం ఏమి తగ్గలేదు. హీరోయిన్స్ కు వయసు పెరిగుతుంటే ఆఫర్స్ తో పాటు వాళ్ళ కి ఇచ్చే రెమ్యూనరేషన్ కూడా తగ్గుతుంది. కానీ కాజల్ విషయంలో ఇది రివర్స్ అయింది.

మొన్న చిరంజీవి లాంటి స్టార్ సీనియర్ హీరోతో నటించిన కాజల్ లేటెస్ట్ బెల్లంకొండ శ్రీనివాస్ తో వరసగా రెండు సినిమాలు చేస్తుంది. తేజ డైరెక్షన్ లో ఒకటి..ఇంకోటి 'కవచం' అనే సినిమాలో నటిస్తుంది. ఈసినిమా కోసం కాజల్ కోటిన్నర రూపాయల రెమ్యూనరేషన్ తీసుకుందంట. ఆమెకు టాలీవుడ్ లో ఇంకా క్రేజ్ ఉండటంతో ప్రొడ్యూసర్స్ ఆమె అడిగినంత ఇచ్చేస్తున్నారట.

ఆమె ఇండస్ట్రీ కి వచ్చి ఇన్నేళ్లు అవుతున్న ఇంత డిమాండ్ ఉండడం నిజంగా గ్రేట్. తెలుగులో సినిమాలు చేస్తూనే కోలీవుడ్ లో కూడా ఆఫర్స్ కొట్టేస్తుంది. కొత్తగా వచ్చిన యంగ్ హీరోయిన్స్ తో పోటీ పడుతూ..ఇలా రెండు ఇండస్ట్రీలో సినిమాలతో బిజీ అయిపోయింది మన కాజల్ పాపా.

Similar News