కాజల్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

పొరిగింటి కూర రుచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి! అలానే టాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ కల ఉంటుంది. ఆ కల [more]

Update: 2019-09-08 04:33 GMT

పొరిగింటి కూర రుచి చూడాలని ఎవరికి ఉండదు చెప్పండి! అలానే టాలీవుడ్ హీరోయిన్స్ కి కూడా బాలీవుడ్ లో సినిమాలు చేయాలనీ కల ఉంటుంది. ఆ కల ను నిజం చేసుకునేందుకు చాలా ట్రై చేస్తుంటారు మన హీరోయిన్స్. కొంతమంది సక్సెస్ అయితే కొంతమంది ఫెయిల్ అవుతారు. అయినా కానీ ప్రయత్నించడం మాత్రం ఆపరు. ఎందుకంటే ఒక్కసారి బాలీవుడ్ లో సెటిల్ అయితే లైఫ్ లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉండదు.

కేవలం అంతేనా?

ఈ ప్రయత్నంలోనే టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ ఉంది. ఆల్రెడీ ఈ బ్యూటీ బాలీవుడ్ లో ‘సింగం, దో లఫ్జొంకి కహాని’ అంటూ రెండు అటెంప్ట్స్ చేసి చేతులు కాల్చుకుని కూడా మళ్లీ అక్కడ సినిమా చేయాలనీ చూస్తుంది. అది కూడా జాన్ అబ్రహం తో. రీసెంట్ గా ఈమె ’ముంబయి సాగ’ సినిమాకు సైన్ చేసిందని తెలుస్తుంది. ఇందులో జాన్ అబ్రహం హీరో. ఈమూవీ కోసం కాజల్ కేవలం రూ.30 లక్షలు మాత్రమే పారితోషకంగా తీసుకుంటోందని ఇండస్ట్రీ వర్గాల టాక్. తెలుగు లో కనీసం కోటి రూపాయల రెమ్యునరేషన్ లేకుండా సినిమా చేయని కాజల్… హిందీ లో కేవలం 30 లక్షలకే చేయడం ఏంటో అర్ధం కానీ విషయం. అయినా హిందీ పైనే ఈ అమ్మడుకి అంత మక్కువ ఏంటో?

Tags:    

Similar News