కాజల్ సరికొత్త రికార్డు..!

తెలుగు హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్స్ కి. ఇప్పుడు వారంతా ఇంస్టాగ్రామ్ పై పడ్డారు. ఇంస్టాగ్రామ్ లో [more]

Update: 2019-04-17 10:18 GMT

తెలుగు హీరోయిన్స్ కు సోషల్ మీడియాలో మాములు క్రేజ్ లేదు. ముఖ్యంగా మన స్టార్ హీరోయిన్స్ కి. ఇప్పుడు వారంతా ఇంస్టాగ్రామ్ పై పడ్డారు. ఇంస్టాగ్రామ్ లో మన టాలీవుడ్ బ్యూటీలలో అందరికంటే ముందు ఉన్నది చక్కనైన చందమామ కాజల్ అగర్వాల్. ఆ తరువాత రకుల్, సమంత ఉన్నారు. ఇంస్టాగ్రామ్ లో కాజల్ ఇప్పుడు ఒక సూపర్ రికార్డ్ నెలకొల్పింది. టాలీవుడ్ హీరోయిన్స్ లో మొదటి సారిగా 10 మిలియన్ ఫాలోయర్లను సాధించింది కాజల్ మాత్రమేనని సమాచారం.

సెకెండ్ ఉన్న రకుల్…

టాలీవుడే కాదు సౌత్ మొత్తంలో ఏ హీరోయిన్ కీ ఇంస్టాగ్రామ్ లో ఈ రేంజ్ ఫాలోయింగ్ లేదట. అందుకే కాజల్ ను తన ఫ్యాన్స్ ఇంస్టాగ్రామ్ క్వీన్ గా పిలుచుకుంటున్నారు. కాజల్ తరువాత స్థానంలో రకుల్ ప్రీత్ సింగ్ 7.3 మిలియన్ల ఫాలోయర్స్ తో ఉంది. ఇక సమంతకు 6.5 మిలియన్ల ఫాలోయర్లు మాత్రమే ఉన్నారు. తన ఇంస్టా ఫాలోయర్స్ 10 మిలియన్ మార్క్ సాధించిన సందర్భంగా కాజల్ విషెస్ చెప్పింది. ‘‘మీ ప్రేమ.. మీ మద్దతే నా ప్రపంచం. అందరికీ మిలియన్ల కిస్సులు’’ అంటూ పోస్ట్ చేసింది.

Tags:    

Similar News