కాజల్ వాస్తవం గ్రహించిందా?

వయసు దాటిపోయినా.. పెళ్లి ఊసెత్తడంలేదు కాజల్ అగర్వాల్. ఇంకా సినిమాల్లో చక్రం తిప్పుదామని అలానే కూర్చుండిపోయింది. అందుకే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు చేసేస్తూ.. వరసగా ప్లాప్స్ కొడుతోంది. [more]

Update: 2019-11-20 05:54 GMT

వయసు దాటిపోయినా.. పెళ్లి ఊసెత్తడంలేదు కాజల్ అగర్వాల్. ఇంకా సినిమాల్లో చక్రం తిప్పుదామని అలానే కూర్చుండిపోయింది. అందుకే వచ్చిన అవకాశాన్ని వచ్చినట్టు చేసేస్తూ.. వరసగా ప్లాప్స్ కొడుతోంది. నేనే రాజు నేనే మంత్రి లో తేజ మంచి అవకాశం ఇచ్చాడని.. అర్ధం పర్ధం లేని సీత సినిమాకి ఓకె చెప్పింది. అలాగే రెమ్యునరేషన్ అధికమని బెల్లంకొండ కవచం చేసింది. ఇంకా స్టార్ హీరోల సినిమాలో ఎలాగూ అవకాశం రావడం లేదు కదా…కుర్ర హీరోలతోనైనా సర్దుకుపోదామని ఫిక్స్ అయ్యే బెల్లంకొండ సరసన రెండుసార్లు, శర్వానంద్ సరసన రణరంగంలో నటించింది. కానీ లాభం లేదు.

తాజాగా మరో ప్లాప్ హీరోకి ఓకె చెప్పిందనే న్యూస్ నడుస్తుంది. అది తిప్పారా మీసం తో డిజాస్టర్ కొట్టిన శ్రీ విష్ణు తదుపరి చిత్రానికి కాజల్ అగర్వాల్ హీరోయిన్ అంటున్నారు. మరి గ్లామర్ పరంగా కాజల్ ఇంకా యంగ్ హాట్. కానీ ఆమె కెరీర్ పరంగా సూపర్ సీనియర్ లిస్ట్ లోకెళ్ళిపోయింది. అందుకే వాస్తవాన్ని అర్ధం చేసుకున్న కాజల్ ప్లాప్, కుర్ర హీరోలకు ఓకె చెప్పడమే కాదు… కన్నడ లో కూడా నటించడానికి ఓకె చెప్పిందట. కన్నడ సీనియర్ హీరో ఉపేంద్ర సరసన కాజల్ నటించబోతున్నట్లుగా తెలుస్తుంది. మరి తెలుగులోనూ చిరు సరసన, తమిళనాట కమల్ సరసన నటిస్తున్న కాజల్.. కన్నడలో కూడా మొదలెట్టేసిందనన్నమాట.

Tags:    

Similar News