కాజల్ చెప్పినట్లు జరిగితే… ఆల్ హ్యాపీస్..!

సీత మూవీ ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ కేవలం సీత గురించి మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాలు మీడియాతో పంచుకుంటుంది. సీత సినిమా కోసం తానెంత [more]

Update: 2019-05-21 06:52 GMT

సీత మూవీ ప్రమోషన్స్ లో కాజల్ అగర్వాల్ కేవలం సీత గురించి మాత్రమే కాదు.. ఇంకా చాలా విషయాలు మీడియాతో పంచుకుంటుంది. సీత సినిమా కోసం తానెంత శ్రమించానో చెబుతున్న కాజల్ ని మీడియా మిత్రులు కాజల్ నటించబోయే భారతీయుడు 2 సినిమా విషయాలు అడగగా.. దానికి కాజల్ అగర్వాల్ తాను కూడా ఆ సినిమా షూటింగ్ మళ్లీ ఎప్పుడు మొదలవుతుందా అని వెయిట్ చేస్తున్నానని… భారతీయుడు 2 ఆగిపోయింది అని జరిగే ప్రచారంలో నిజం లేదని చెబుతుంది. భాతీయుడు 2 సినిమా కచ్చితంగా ఉంటుందని చెబుతుంది కాజల్.

కమల్ బిజీగా ఉండటంతో

కమల్ హాసన్ వలన భారతీయుడు 2 షూటింగ్ ఆగిపోయింది, నిర్మాతల వలన సినిమా షూటింగ్ కి బ్రేక్ వచ్చింది అనే ప్రచారంలో నిజం లేదని…. కమల్ సర్ ఎన్నికల్లో బిజీగా ఉండడం వల్లనే భారతీయుడు 2 సినిమా షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారని.. మళ్లీ జూన్ నుండి భారతీయుడు 2 సెట్స్ మీదకెళుతుందని.. ఎప్పుడెప్పుడు భారతీయుడు 2 షూటింగ్ లో పాల్గొంటానో అనే క్యూరియాసిటీతో ఉన్నానని చెబుతుంది. మరి నిజంగానే కాజల్ అగర్వాల్ చెప్పినట్లుగా భారతీయుడు 2 మళ్లీ మొదలైతే అటు శంకర్, ఇటు నిర్మాతలు అలాగే కమల్ హాసన్ అభిమానులు అందరూ ఆల్ హ్యాపీస్.

Tags:    

Similar News