‘రణరంగం’ లో తనదే మెయిన్ పాత్ర అంట

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేయడానికి చాలానే సినిమాలు చేసింది. కానీ ఆమెకు నటిగా మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఇప్పటివరకు తనకు ఉన్న క్రేజ్ [more]

Update: 2019-08-10 13:38 GMT

హీరోయిన్ గా కాజల్ అగర్వాల్ చేయడానికి చాలానే సినిమాలు చేసింది. కానీ ఆమెకు నటిగా మాత్రం అనుకున్న స్థాయిలో గుర్తింపు లభించలేదు. ఇప్పటివరకు తనకు ఉన్న క్రేజ్ గ్లామర్ పరంగా లాగించుకోచ్చేస్తుంది. ప్రస్తుతం కాజల్ శర్వానంద్ తో ‘రణరంగం’ చేస్తుంది. ఈమె ఇందులో సెకండ్ హీరోయిన్ అని ట్రైలర్ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్ పరంగా ఇందులో కళ్యాణి ప్రియదర్శినికె ఎక్కువ ఇంపార్టెన్స్ ఉన్నట్టు అర్ధం అవుతుంది.

అయితే కాజల్ మాత్రం తనదే మెయిన్ లీడ్ రోల్ అని… తన వల్లే కథ మలుపు తిరుగుతుందని ఓ ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చింది. ఈమూవీలో తాను చేసింది డాక్టర్ పాత్ర అని.. సెకెండ్ హాఫ్‌లో తన క్యారెక్టర్ ఎంటరవుతుందని చెప్పింది. అయితే ఈ సినిమా చేస్తున్నప్పుడు అసలు కాజల్ ఎందుకు ఈ సినిమా చేస్తుందని అన్నారని..నాకు కథ నచ్చింది కాబట్టే ఈసినిమా చేశాను అని చెబుతుంది. తన పాత్ర వల్లే సినిమా ముందు కు నడుస్తుందని…సినిమా చూసాక మీకే అర్ధం అవుతుంది ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నానో అని అంటుంది. చూద్దాం కాజల్ చెప్పినట్టు తన పాత్ర ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉంటుందో అని. ఆగస్టు 15 న ఈమూవీ రిలీజ్ అవుతుంది. సుధీర్ వర్మ ఈమూవీ కి దర్శకత్వం వహించారు.

Tags:    

Similar News