కాజల్ ఎక్కడా తగ్గడం లేదుగా?

ఈ వయసులోను కాజల్ అగర్వాల్ గ్లామర్ పరంగా దూసుకుపోతూనే ఉంది. కవచం, సీత సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు కుర్ర హీరో శర్వానంద్ [more]

Update: 2019-07-30 06:02 GMT

ఈ వయసులోను కాజల్ అగర్వాల్ గ్లామర్ పరంగా దూసుకుపోతూనే ఉంది. కవచం, సీత సినిమాల్లో గ్లామర్ పాత్రల్లో అదరగొట్టిన కాజల్ అగర్వాల్ ఇప్పుడు కుర్ర హీరో శర్వానంద్ పక్కన రణరంగంలోను ఇరగదీస్తోంది. ఇప్పటికే విడుదలైన రణరంగం స్టిల్స్, సాంగ్ లో కాజల్ అగర్వాల్ గ్లామర్ కి అందరూ ఫిదా అవుతున్నారు. చందమామ సినిమాలో కాజల్ ఎలా ఉందొ ఇప్పటికి కాజల్ అలానే ఉంది అంటూ కాజల్ అందాలకు కితాబునిచ్చేస్తున్నారు. కవచం, సీత సినిమాలు డిజాస్టర్స్ అయినా కాజల్ కి అవకాశాలు మాత్రం వస్తూనే ఉన్నాయి. చేతిలో హిట్స్ లేకపోయినా… అమ్మడుకి అవకాశాలు కుర్ర హీరోగా రూపంలో తలుపు తడుతూనే ఉన్నాయి.

సమంత, తమన్నా, అనుష్క లాంటి వాళ్ళు హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారితే కాజల్ మాత్రం ఇప్పటికి గ్లామర్ పాత్రలకే ఇంపార్టెన్స్ ఇస్తుంది. ఇక కాజల్ నటిస్తున్న రణరంగం, మరో తమిళ మూవీ కూడా ఆగష్టు 15 కే విడుదల కాబోతున్నాయి. ఇంకా కాజల్ పారిస్ పారిస్ తో పాటుగా భారతీయుడు 2 సినిమాలో కమల్ హాసన్ సరసన కూడా నటించబోతుంది. అయితే ఏ సినిమాలైనా కాజల్ మాత్రం హాట్ హాట్ గ్లామర్ పాత్రలతో కిర్రాక్ పుట్టిస్తుంది. మరి రణరంగం సాంగ్ లోనే హాట్ గా క్యూట్ గా కనిపిస్తున్న కాజల్ సినిమాలో ఇంకెలాంటి మెరుపులు మెరిపిస్తుందో. మరి ఈ సినిమాలో కాజల్ తో పాటుగా మరో హీరోయిన్ కళ్యాణి ప్రియదర్శిన్ కూడా నటిస్తుంది. ఈ ట్రెడిషనల్ గర్ల్ కళ్యాణి గ్లామర్ గర్ల్ కాజల్ ముందు ఎలా నిలబడుతుందో చూడాలి.

Tags:    

Similar News