క్రేజీ కాంబినేషన్ లో ఛాన్స్ కొట్టేసిందిగా..!

మహేష్ ”భరత్ అనే నేను” సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన నార్త్ బ్యూటీ కైరా అద్వానీ ఒక పక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరో పక్క [more]

Update: 2019-01-03 07:06 GMT

మహేష్ ”భరత్ అనే నేను” సినిమాతో తెలుగుతెరకు పరిచయం అయిన నార్త్ బ్యూటీ కైరా అద్వానీ ఒక పక్క బాలీవుడ్ లో సినిమాలు చేస్తూ మరో పక్క తెలుగులో వరుస సినిమాలని ఓకే చేస్తుంది. రీసెంట్ గా ఆమె నటించిన రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ సినిమా ఈ సంక్రాంతికి రిలీజ్ కానుంది. యూత్ లో కూడా మంచి ఫాలోయింగ్ ఉన్న కైరాకు టాలీవుడ్ నుండి మరో ఆఫర్ వచ్చింది. త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమాలో ఈమెకి హీరోయిన్ గా ఛాన్స్ వచ్చిందని అంటున్నారు.

హీరోయిన్ పాత్రే కీలకం

ఎప్పటినుండో బన్నీ తన నెక్స్ట్ మూవీ ఏంటి అనేది సస్పెన్స్ లోనే ఉంచాడు. మూడు రోజులు కిందట ఆ సస్పెన్స్ కు తెర దించుతూ అధికారిక ప్రకటన చేసాడు. ప్రస్తుతం స్క్రిప్ట్ పనులు చకచకా చేస్తున్న త్రివిక్రమ్ త్వరలోనే ఈ సినిమాను సెట్స్ మీదకు తీసుకుని వెళ్లి దసరాకి రిలీజ్ చేయాలని చూస్తున్నాడు. ఇందులో హీరోయిన్ పాత్ర కథలో కీలకమని తెలుస్తోంది. అందుకే కైరా డేట్స్ కూడా మాట్లాడుకుంటే బెటర్ అని త్రివిక్రమ్ టీమ్ ఆమెతో చర్చలు జరిపినట్లు టాక్. మరి ఆమె ఓకే చెప్పిందో లేదో ఇంకా తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా అమ్మడుకి టాలీవుడ్ తెగ కలిసొచ్చేస్తుంది.

Tags:    

Similar News