భరత్ భామ లవ్ లో పడిందా..?

Update: 2018-08-01 08:00 GMT

బాలీవుడ్ లో పెద్దగా ఆఫర్స్ లేని కైరా అద్వానీకి టాలీవుడ్ బడా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ పక్కన అదరగొట్టే ఛాన్స్ ఇచ్చాడు. భరత్ అనే నేను సినిమాలో కైరాకి మధ్యతరగతి అమ్మాయి పాత్ర ఇచ్చాడు కొరటాల. యంగ్ సీఎం మహేష్ బాబు ప్రేమలో మునిగిపోయే మిడిల్ క్లాస్ అమ్మాయిగా కియారా పాత్ర పరిధి తక్కువే అయినా.. పాటల్లో మాత్రం అదరగొట్టేసింది తన గ్లామర్ తో. అలాగే రామ్ చరణ్ తో కూడా మంచి ఛాన్స్ అందుకుంది ఈ భామ. ప్రస్తుతం చరణ్ - బోయపాటి సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది.

సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమాయణం

మరి చేతిలో ఉన్న రెండు మూడు సినిమాలకే ఇప్పుడు కైరా అద్వానీ పేరు మీడియాలో మార్మోగిపోతోంది. మొన్నటికి మొన్న ఒక ఫ్యాషన్ షో లో తన అందాలతో మైమరపించిన కైరా నిన్న తన పుట్టిన రోజు వేడుకల్ని చేసుకుంది. తన పుట్టిన రోజు వేడుకలలో కైరా తన అందాలతో అదరగొడుతూ గెస్ట్ లతో తన బర్త్ డే పార్టీని ఎంజాయ్ చేసింది. ఇక తాజాగా ఈ రోజు కైరా ప్రేమలో పడిందనే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అది కూడా బాలీవుడ్ హీరో సిద్ధార్థ్ మల్హోత్రాతో కైరా డేటింగ్ చేస్తున్నట్లుగా వార్తలొస్తున్నాయి.

సిద్ధార్థ్ లిస్ట్ లోకి చేరిన కైరా

మరి బాలీవుడ్ లో అక్షయ్ కుమార్, రణబీర్ కపూర్ తర్వాత అంతటి ప్రేమ ఘనుడు సిద్ధార్థ్ మల్హోత్రానే. ఎందుకంటే సిద్ధార్థ్ మల్హోత్రా ఇప్పటికే అలియా భట్, జాక్వెలిన్ లతో ప్రేమాయణం నడిపిన ప్రబుద్దుడు. మరి తాజాగా ఇప్పుడు సిద్దార్ధ్ లిస్ట్ లో కైరా వచ్చి చేరింది. కైరా బర్త్ డే రోజునే ఈ విషయం బయటికి పొక్కినట్లుగా బాలీవుడ్ వర్గాల భోగట్టా. కైరా, సిద్దార్ధ్ ని ఎక్కడబడితే అక్కడ మీడియా కంటికి చిక్కుతున్నారని.. లంచ్ లు, డిన్నర్ లు అంటూ డేటింగ్స్ తో ఈ జంట బిజీగా ఉందని బి టౌన్ కోడై కూస్తుంది.

Similar News