కూతుళ్లే వ్యతిరేకించారు

Update: 2018-08-09 07:20 GMT

సినిమాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ప్రముఖ నటుడు కమల్ హాసన్ ను ఆయన కూతుళ్లే వ్యతిరేకించారట. ఆయన సినిమాలు వదిలి, రాజకీయాల్లోకి రావడాన్ని, పార్టీ పెట్టడాన్ని ఆయన కుమార్తెలు శ్రుతి హాసన్, అక్షరా హాసన్ మొదట్లో తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన స్వయంగా వెల్లడించారు. శ్రుతి హాసన్ అయితే కమల్ నూ వారించిందట. అయితే, ఇప్పుడు మాత్రం వారు తండ్రి నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. తండ్రికి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ విషయాన్ని స్వయంగా కమల్ హాసనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం విశ్వరూపం-2 చిత్రంలో ప్రమోషన్స్ లో భాగంగా కమల్ వివిధ నగరాలను చుడుతున్నాడు.

Similar News