ఈ ఏడాది అక్కడ అర్జున్ రెడ్డే నెంబర్ వన్

తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో తెలుగు సినిమా అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తే.. ఆ సినిమా అక్కడ సంచలన రికార్డులను నమోదు [more]

Update: 2019-08-07 05:59 GMT

తెలుగు దర్శకుడు బాలీవుడ్ లో తెలుగు సినిమా అర్జున్ రెడ్డి ని కబీర్ సింగ్ గా రీమేక్ చేస్తే.. ఆ సినిమా అక్కడ సంచలన రికార్డులను నమోదు చేసింది. స్టార్ హీరోల కలెక్షన్స్ కి కూడా వెనక్కి నెట్టేసి మరీ ఈ ఏడాది టాప్ పొజిషన్ లో ఉంది కబీర్ సింగ్ మూవీ. సందీప్ రెడ్డి వంగ తన అర్జున్ రెడ్డి తెలుగు సినిమాని బాలీవుడ్ లో షాహిద్ కపూర్ హీరోగా కబీర్ సింగ్ గా రీమేక్ చేసాడు. ఆ సినిమా మొదట్లో కాంట్రవర్సీలకు నెలవుగా మారినా.. కలెక్షన్స్ పరంగా దూసుకుపోయింది. నిర్మాతలకు కబీర్ సింగ్ కలెక్షన్స్ వర్షం కురిపించడమే కాదు.. ఈ ఏడాది ఇప్పటివరకు అత్యధిక కలెక్షన్స్ సాధించిన చిత్రంగా కబీర్ సింగ్ నిలిచింది.

సల్మాన్ సినిమాను క్రాస్ చేసి….

ఈ ఏడాది విడుదలైన స్టార్ హీరోల సినిమాలు సల్మాన్ ఖాన్ సినిమా భరత్ కలెక్షన్స్ ని కబీర్ సింగ్ క్రాస్ చేసేసింది. కబీర్ సింగ్ 280 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించిన సినిమాగా ఈ ఏడాది ఫస్ట్ ప్లేస్ కొట్టెయ్యగా… విక్కీ కౌశల్ నటించిన URI తర్వాతి కలెక్షన్స్ తో సెకండ్ ప్లేస్ ని ఆక్రమించింది. ఇక సల్మాన్ ఖాన్ భరత్ మూవీ మూడో ప్లేస్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. తరవాతి స్థానాల్లో కేసరి, టోటల్ ఢమాల్ చిత్రాలు నిలిచాయి. కబీర్ సింగ్ మొదటి స్థాన్నాన్ని ఆక్రమించినట్లుగా బాలీవుడ్ ప్రముఖ ఎనలిస్ట్ తరుణ్ ఆదర్శ్ తన ట్విట్టర్ లో ట్వీట్ చేసాడు. మరి ఒక తెలుగు సినిమా రీమేక్ అక్కడ స్టార్ హీరోల సినిమాలను తలదన్ని మొదటి ప్లేస్ ఆక్రమించుకోవడం మామూలు విషయం కాదు.

Tags:    

Similar News