అక్కడ రంజాన్ నెలలో రజనీ రికార్డు

Update: 2018-06-08 11:12 GMT

సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కాలా చిత్రానికి రివ్యూలు, విమర్శకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చినా దేశవాప్తంగా ఈ చిత్రం కొత్త రికార్డులు నమోదు చేస్తోంది. భారత్ లోనే కాదు విదేశాల్లోనూ ఈ సినిమా రికార్డులు నమోదు చేస్తోంది. ఇప్పుడు సౌదీ అరేబియాలో విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రంగా కూడా కాలా అరుదైన రికార్డు సృష్టించింది. 35 ఏళ్లుగా సౌదీ అరేబియాలో సినిమాల ప్రదర్శన నిషేధం. ఇటీవలే ఈ నిషేధాన్ని ఎత్తివేశారు. దీంతో నిషేదం ఎత్తివేసిన తర్వాత అక్కడ విడుదలైన మొట్టమొదటి భారతీయ చిత్రంగా కాలా నిలిచింది. ఈ విషయాన్ని కాలా చిత్ర మేకర్స్ వాండర్ బార్ ఫిల్మ్స్ ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ముంబాయిలోని అతిపెద్ద మురికివాడ ధారావిని ఆక్రమించుకోవాలనే ఓ రాజకీయ నాయుకుడిని ఎదిరించే కథాంశంతో రూపొందింది కాలా. ఈ చిత్రానికి విడుదలైన అన్ని భాషల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. పా రంజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా, రజనీకాంత్ తో పాటు నానా పటేకర్, ఈశ్వరీరావు, హ్యుమా ఖురేషీ ముఖ్య పాత్రలు పోషించారు.

Similar News