కాలా ని పక్కన పడేసి.....?

Update: 2018-06-08 08:49 GMT

నిన్న గురువారం కర్ణాటక వంటి ప్రాంతాల్లో ఎన్నో అడ్డంకులు ఎదుర్కొని కాలా చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఏప్రిల్ లో విడుదల కావాల్సిన కాలా సినిమా ఎట్టకేలకు జూన్ 7 న విడుదలైంది. అయితే సినిమాపై ట్రేడ్ లో పెద్దగా బజ్ క్రియేట్ కాకపోవడం వలన కాల ఓపెనింగ్ కలెక్షన్స్ పడిపోయాయి. ముందునుండి రజినీకాంత్ సినిమాలకుండాల్సిన క్రేజ్ కాలా కి లేకపోయింది. అసలే ప్రమోషన్స్ విషయంలో అంతంత మాత్రం ఉన్న కాలా సినిమా రోజున సూపర్ స్టార్ రజినీకాంత్ మాత్రం తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ని సైలెంట్ గా మొదలు పెట్టే పనిలో బిజీగా వున్నాడు.

కొత్త సినిమా మొదలు...

కాలా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ వచ్చేస్తాయనుకున్నారేమో. అందుకే కాలా సంగతి పట్టించుకోకుండా ఆయన తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌ వెళ్లిపోయారు. యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ గతంలోనే ఓ సినిమా కమిటైన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ చేసుకున్న వెంటనే రజినీకాంత్ కార్తీక్ సినిమా కోసం డార్జిలింగ్ ఫ్లైట్ ఎక్కేసారు. సరిగ్గా కాలా విడుదల రోజే పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో రజినీకాంత్ - కార్తీక్ సుబ్బరాజు ల కొత్త మూవీ మొదలవడం విశేషం. గురువారం అంటే నిన్న ఈ సినిమాకి సింపుల్‌గా ప్రారంభోత్సవం చేశారు. తర్వాత వెంటనే రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టారు.

ఈ వారమే కలెక్షన్లు...

మరి రజినీకాంత్ రాజకీయాల మాటేమిటో గాని.. ప్రస్తుతం సినిమాల సినిమాలు చేస్తూ పిచ్చ జోరు చూపిస్తున్నాడు. ప్రస్తుతం రజిని నటించిన కాలా చిత్రం థియేటర్స్ లో కుస్తీ పడుతుంది. అయితే కాలా చిత్రానికి ఈ వారంలోనే కలెక్షన్స్ రాబట్టాల్సి ఉంటుంది. లేదంటే వచ్చే వారం సల్మాన్ ఖాన్ రంజాన్ స్పెషల్ గా రేస్ 3 తో వచ్చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తో రజిని కాలా కలెక్షన్స్ కి గండిపడడం ఖాయం.

Similar News