కాలా ప్రమోషన్స్ ని గాలికొదిలేశారా..?

Update: 2018-05-30 07:38 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన కాలా సినిమా జూన్ 7 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఒక్క కర్ణాటకలో మాత్రం కాలా విడుదల కష్టంగా కనబడుతుంది. కావేరి జలాల వివాదంలో రజిని చేసిన వ్యాఖ్యలకు నిరసనగా కర్ణాటక ప్రజలు కాలా ను అడ్డుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టేసారు. ఇప్పటికే కర్ణాటక సెన్సార్ బోర్డు కాలా సినిమాని సెన్సార్ చెయ్యకుండా హోల్డ్ లో పెట్టింది. ఇదిలా ఉంటె.. ఇప్పుడు తమిళనాట కూడా కాలా సినిమా ప్రమోషన్స్ ని ఆపేసారు. నిన్నమొన్నటి వరకు కాలా ప్రమోషన్స్ తో నిర్మాత ధనుష్ తో పాటుగా రజినీకాంత్, రంజిత్ పా లు సినిమా మీద హైప్ పెంచాలనుకున్నారు. అందుకే కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్, కాలా ప్రెస్ మీట్ ని పెట్టాలనుకున్నారు. కానీ... ఈరోజు కాలా ప్రమోషన్స్ ని ఆపేసారు

డ్యూయల్ రోల్ చేయాల్సి ఉన్నందునే...

కారణం తమిళనాడులోని తూత్తుక్కుడిలో జరుగుతున్న పరిణామాలు సూపర్ స్టార్ రజనీకాంత్ ని మార్చేస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాల్లోకి వస్తున్నానంటూ చెబుతున్న రజినీకాంత్ ఇప్పుడు అటు రాజకీయనాయకుడిగా, ఇటు నటుడిగా మెలగాల్సిన పరిస్థితి వచ్చింది. అందుకే కాలా ప్రమోషన్స్ కి బ్రేక్ ఇచ్చి ప్రస్తుతం స్టెరిలైట్‌ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా నిరసనలు జరిపిన ఆందోళనకారులను పోలీస్ లు నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరపగా.. ఆ ఘటనలో 13 మంది ఆందోళనకారులు ప్రాణాలు కోల్పోయారు. అయితే ఆ 13 మంది మరణించిన నేపథ్యంలో బాధితుల కుటుంబాలను పరామర్శించాలని రజినీకాంత్ నిర్ణయించుకున్నారు.

కొంతమంది వ్యతిరేకిస్తున్నా...

అందుకే కాలా ప్రమోషన్స్ ని పక్కనబెట్టి తూత్తుకుడి వెళ్తున్నానని ... అక్కడి ఆ 13 మంది కుటుంబాలను ఓదార్చి.. మళ్లీ ఎలాంటి రక్తసిక్తమైన ఘటనలు జరక్కుండా ఉండాలనేది తన కోరిక అంటూ... పోలీస్ కాల్పుల్లో చనిపోయిన కుటుంబాలకు అండగా ఉంటానని... ఆయన స్వయానా తెలియజేస్తున్నారు. మరి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనను చేసిన వారిని రజిని పరామర్శించి వారిని ఓదార్చడం అనేది మంచి విషయమే. కానీ కొంతమంది అంటే ఆందోళనకారులలోని కొంతమంది రజిని సానుభూతి పర్యటనను వ్యతిరేకిస్తున్నట్టుగా తెలుస్తుంది.

 

Similar News