కాలా పనైపోయింది

Update: 2018-06-19 05:17 GMT

రజినికాంత్ - రంజిత్ పా కాంబోలో తెరకెక్కిన కాలా సినిమా తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. రజిని అల్లుడు ధనుష్ నిర్మించిన ఈసినిమాకి సరైన ప్రమోషన్స్ లేకుండా థియేటర్స్ లో దిగడం ఈ సినిమా ప్లాప్ కి ఒక కారణమైతే... రంజిత్ పా రజినీకాంత్ సరిగ్గా యూస్ చేసుకోలేక సతమతమవడం మరో కారణం... వెరసి ఈ సినిమా కనీసం రెండు వారలు పూర్తి చేసుకోకుండానే రెండు తెలుగు రాష్ట్రాల్లో క్లోజింగ్ బిజినెస్ జరుపుకుంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో ఫెయిల్ అయిన కాలా సినిమా అటు తమిళనాట, ఓవర్సీస్ లో సత్తా చాటింది. ఏది ఎలాగున్నా సూపర్ స్టార్ రజినీకాంత్ స్టామినాకి తగ్గ సినిమా కాలా అయితే కాదు.

 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ కాలా క్లోజింగ్ బిజినెస్ వివరాలు.

ఏరియా: క్లోజింగ్ కలెక్షన్స్ కోట్లలో

నైజాం 2.88

సీడెడ్ 1.25

నెల్లూరు 0.28

కృష్ణ 0.52

గుంటూరు 0.76

వైజాగ్ 0.66

ఈస్ట్ గోదావరి 0.50

వెస్ట్ గోదావరి 0.40

ఏపీ & టీస్ కాలా క్లోజింగ్ షేర్: 7.25

Similar News